మెగాస్టార్ చిరంజీవి తనలానే తన పెద్ద తమ్ముడు నాగబాబుని హీరోని చేద్దాం అనుకున్నారు. నాగబాబుకి హీరోగా నిలబడాలనే ఆసక్తి ఎక్కువ ఉండేది. హీరోగా పలు సినిమాల్లో కూడా నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. హీరోకి మించిన కటౌట్ ఉండడం వల్లో ఏమో కానీ అతను హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.అయితే చిరు తన తల్లి పేరు పై ‘అంజనా ప్రొడక్షన్స్’ సంస్థను స్థాపించి నాగబాబుని నిర్మాతగా నిలబెట్టాలని ప్రయత్నించారు. చిరు బల్క్ డేట్స్ ను నాగబాబు బ్యానర్ కు ఇవ్వడం కూడా చాలా సార్లు జరిగింది.
అలా రుద్రవీణ, త్రినేత్రుడు,ముగ్గురు మొనగాళ్లు,బావగారూ బాగున్నారా,స్టాలిన్ వంటి చిత్రాలు చేసారు. వీటిలో ‘బావగారు బాగున్నారా’ మాత్రమే విజయం సాధించి నాగబాబుకి మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది. 1998వ సంవత్సరంలో ఏప్రిల్ 9న ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. జయంత్. సి. పరాంజీ దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని జయంత్.. పవన్ కళ్యాణ్ తో చేయాలనుకున్నారు. కానీ ఆ టైములో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఈ సినిమాని చేయలేకపోయారు. రంభ ఈ మూవీలో హీరోయిన్ గా నటించగా, రచన సెకండ్ హీరోయిన్ గా..
సినిమాలో చాలా కీలక పాత్ర పోషించింది. మణిశర్మ సంగీతం అందించారు. ‘ఆంటీ కూతురా’ ‘సారి సారి సారి’ వంటి పాటలు చార్ట్ బస్టర్లు అయ్యాయి. ‘ఆంటీ కూతురా’ పాటకి చిరు చేసిన డ్యాన్స్ అప్పట్లో ఓ సెన్సేషన్. శ్రీహరి- చిరంజీవి, రంభ- బ్రహ్మానందం.. మధ్య వచ్చే కామెడీ ట్రాక్ లు కూడా ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.దర్శకుడు జయంత్ ఈ చిత్రం విజయంతో స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయారు.
ఒక్క వైజాగ్ లోనే 15 థియేటర్లలో ఈ మూవీ 50 రోజులు, 7 థియేటర్లలో 100 రోజులు ఆడి రికార్డ్ సృష్టించింది. మొత్తంగా 86 కేంద్రాల్లో 50 రోజులు, 54 కేంద్రాల్లో 100 రోజులు ఆడి సూపర్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. నేటితో ఈ చిత్రం విడుదలై 24 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!