Sravanthi: ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ స్రవంతి చొక్కారపు గురించి ఎవ్వరికీ తెలియని 10 విషయాలు..!

‘బిగ్ బాస్’ కు తెలుగులో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఓటిటి సీజన్‌ ప్రారంభమైంది. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ అంటూ శనివారం నాడు గ్రాండ్‌‌గా ప్రారంభమైంది. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో 24*7 నాన్‌ స్టాప్‌గా ఈ షో ప్రసారం కానుంది. ఈ ఓటిటి సీజన్ ను కూడా నాగార్జుననే హోస్ట్ చేయబోతున్నారు.స్మాల్‌ స్క్రీన్‌పై కూడా బిగ్ బాస్ మరింత సందడి చేయడం ఖాయం .. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్‌బాస్‌ని చూసేయొచ్చు అంటూ నాగార్జున తెలిపారు.

84 రోజులు, 17 మంది కంటెస్టెంట్లతో ఈ షో మొదలైంది. గత బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న వారిని వారియర్స్‌గా, కొత్తగా వచ్చే వారిని చాలెంజర్లుగా ప్రకటిస్తూ ఈ షోని మొదలుపెట్టారు. వీరి మధ్యే పోటీ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ షోలో రెండో ఛాలెంజర్ గా స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది. స్రవంతి సోషల్ మీడియాని ఫాలో అయ్యేవాళ్ళకి బాగా తెలుసు.. ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుంది.

1) గత కొంతకాలంగా టాలీవుడ్ సెలబ్రిటీలను తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఈ అమ్మడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.టీవీ ప్రోగ్రాంలలో మెరుస్తూనే, సినిమా ప్రమోషన్లకు సంబంధించిన ఇంటర్వ్యూలను చేయడం అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో షో చేయడం స్రవంతికి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది.

2) ‘పుష్ప’ టీమ్ తో ఈమె చేసిన ఇంటర్వ్యూలో బాగా ఫేమస్ అయ్యాయి. రాయలసీమ యాసలో ‘పుష్ప’ టీంని ఇంటర్వ్యూ చేసి ఈ అమ్మడు బాగా ఆకట్టుకుంది.

3) ఈమె నవ్వుకి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్న విషయాన్ని ఈ అమ్మడు చెబుతూనే మరోపక్క బాడీ షేమింగ్ కూడా ఎదుర్కొన్నట్టు ఎమోషనల్ కామెంట్స్ చేసింది.అలాగే తాను రెండు సార్లు పెళ్లి చేసుకున్నట్టు కూడా తెలిపి షాకిచ్చింది.ప్రేమ పెళ్లి..అంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని.. అందుకే పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది.తర్వాత కొన్నాళ్ళకి ఇంట్లో వాళ్లు తగ్గి వీళ్ళిద్దరికీ మళ్లీ పెళ్లి చేశారట.

4) ఈ అమ్మడికి పెళ్ళైనట్టు చాలా మందికి తెలీదు. బిగ్ బాస్ స్టేజి పైనే ఆ విషయాన్ని తెలిపి తన అత్తింటి పేరుని ఫేమస్ చేస్తున్నట్టు ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

5) స్రవంతి ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకి చెందిన కదిరికి చెందిన అమ్మాయి.అక్కడే పుట్టి పెరిగింది. 2009లో చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది.

6) మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ ఛానల్ లో పనిచేసింది.

7) బెస్ట్ ఆఫ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో కూడా ఈమె యాంకర్ గా చేసిన సంగతి తెలిసిందే.

8) ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోతో పాటు ‘జబర్దస్త్‌’ లో కూడా కొన్ని షోలలో కనిపించింది.

9) స్రవంతి భర్త పేరు ప్రశాంత్. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ అభిమానులు.వీరి అభిరుచులు కలవడం వలెనే వీరి మధ్య ప్రేమ చిగురించడం అది పెళ్ళి వరకు వెళ్లడం జరిగింది.

10) స్రవంతి- ప్రశాంత్ లు తమ కుమారుడికి అఖిరా నందన్ అని పేరు పెట్టుకోవడం మరో విశేషం.

 

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus