Soundarya: సౌందర్య భర్త గురించి మనకి తెలియని విషయాలు..!

సావిత్రి గారి తరువాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటి సౌందర్య అనే చెప్పాలి. కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయే అయినప్పటికీ తెలుగమ్మాయే అనేంతలా ఈమె గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రలే చేయాలి.. స్టార్ హీరోల సినిమాల్లోనే నటించాలి అనే పద్దతిని ఈమె పూర్తిగా మార్చేసింది.ఈమె ఎంత స్టార్ డం సంపాదించుకున్నా.. చిన్న హీరోలు అలాగే మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో నటించడానికి ఇన్సెక్క్యూర్ గా ఫీలయ్యేది కాదు. అందుకే ఈమె గురించి అప్పటి దర్శక నిర్మాతలు చాలా గొప్పగా చెబుతుంటారు.

అయితే 2004 వ సంవత్సరంలో ఈమె ఎవ్వరూ ఊహించని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇదిలా ఉండగా.. ఈమె ఆస్తి అప్పట్లోనే కొన్ని వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈమె ఆస్తి విషయం పై కోర్టులో కేసు నడుస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈమె ఆస్తిని ఈమె భర్త అనుభవిస్తున్నాడని.. సౌందర్య తల్లిదండ్రులకు దక్కాల్సిన వాటాని కూడా ఇవ్వడం లేదని కేసు నడుస్తూనే ఉంది. నిజానికి సౌందర్య భర్త గురించి చాలా మందికి పూర్తి వివరాలు తెలీదు. ఇతని పేరు జి.ఎస్. రఘు.ఇతను సౌందర్యకి దగ్గర బంధువే..!

అయినప్పటికీ ఇతన్ని పెళ్లి చేసుకోవడం సౌందర్య తల్లిదండ్రులకి ఇష్టం లేదు. వాళ్ళ మాట కాదని సౌందర్య రఘుని 2003 లో పెళ్లి చేసుకుంది. రఘు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా.5 ఏళ్ళ పాటు వీళ్ళ దాంపత్య జీవితం కొనసాగినా వీళ్ళకి ఎటువంటి సంతానం లేదు. ఇక సౌందర్య పోయిన కొంతకాలానికి అపూర్వ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రఘు. ప్రస్తుతం ఇతను గోవాలో స్థిరపడ్డాడని తెలుస్తుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus