ఈ లాక్ డౌన్ టైములో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది హీరో సత్యదేవ్ అనే చెప్పాలి. ఎందుకంటే అతను నటించిన రెండు సినిమాలు డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలయ్యాయి.అందులో ఒకటి ’47 డేస్’ కాగా మరొకటి ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం. త్వరలోనే సత్యదేవ్ నటించిన మరో చిత్రం ‘గువ్వ గోరింక’ కూడా అమెజాన్ ప్రైమ్లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా.. కెరీర్ ప్రారంభంలో సత్యదేవ్ జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసేవాడన్న సంగతి తెలిసిందే.
ఓ పక్క సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా చేస్తూనే.. మరోపక్క సినిమాల్లో కూడా నటించేవాడు. నెలకు రూ.1.5 లక్షలు సంపాదించే సత్యదేవ్.. సడెన్ గా ఉద్యోగం మానేసి పూర్తిస్థాయి నటుడుగా మారడానికి సిద్దపడ్డాడట. ఇందుకు ప్రధాన కారణం తన భార్యే అని చెబుతున్నాడు ఈ ట్యాలెంటెడ్ హీరో. “నా భార్య పేరు దీపిక. నేను ఏం చేసినా 100శాతం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తాను అని తనకి తెలుసు. అందుకే నేను రెండు రకాలుగా కష్టపడటం ఇష్టం లేక.. జాబ్ మానెయ్యమని సూచించింది.
కచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అని తను బలంగా నమ్మింది. ‘వీడిని ఎడారిలో వదిలేసినా ఏదో ఒక రకంగా బ్రతికేస్తాడు’ అనేది తన ఫిలాసఫీ. నేను ఉద్యోగం మానేసి సినిమాల్లో ట్రై చేస్తున్నప్పుడు.. మా అమ్మ నాన్నలను కన్విన్స్ చేసి.. చాలా సపోర్ట్ ఇచ్చింది తనే.! నిజంగా ఆమె నా భార్యగా దొరకడం నా అదృష్టం. నేను ఆమెకి బిగ్ థాంక్స్ చెప్పుకోవాలి” అంటూ చెప్పుకొచ్చాడు సత్యదేవ్.