అప్పటి హీరో నవీన్ గురించి ఎవ్వరికీ తెలియని షాకింగ్ నిజాలు..!

ఫ్యామిలీ హీరోలుగా జగపతి బాబు, శ్రీకాంత్ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వారికి పోటీ ఇచ్చాడు వడ్డే నవీన్. నిర్మాత వడ్డే రమేశ్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తొలి సినిమా కోరుకున్న ప్రియుడు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన నవీన్‌కు సరైన బ్రేక్ తెచ్చి పెట్టింది మాత్రం పెళ్లి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో ఆయనకంటూ గుర్తింపు వచ్చింది. దీని తర్వాత మనసిచ్చి చూడు, మా బాలాజీ, ప్రేమించే మనసు, చాలా బాగుంది లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ క్రేజ్‌ను నిలబెట్టుకోలేకపోయాడు నవీన్. అవకాశాలు తగ్గిపోవడంతో అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సైతం నటించాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఫేడవుట్ అయ్యారు. ఆయన తండ్రి వడ్డే రమేశ్ గురించి తప్ప నవీన్ భార్యా పిల్లలు, వ్యక్తిగత జీవితం గురించి బయట పెద్దగా తెలియదు. అయితే వడ్డే రమేష్, నందమూరి కుటుంబాల మధ్య ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉండేది. దీంతో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురైన చాముండేశ్వరిని నవీన్ పెళ్లాడాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్లకే వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ ప్రభావం కెరీర్‌పై పడటంతోనే నవీన్ సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. విడాకుల కారణంగా కొంతకాలం సినిమాలకు తానే దూరమయ్యానని, ఆ తర్వాత అవకాశాలు రాలేదని చెప్పారు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్న నవీన్‌ ప్రస్తుతం భార్యా, పిల్లలతో కలిసి జీవిస్తున్నారు. ఇటీవలే ఆయన కుమారుడికి నిర్వహించిన పంచె కట్టు కార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus