కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ.. వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండే విజయశాంతి మరోపక్క హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసేదాన్న సంగతి తెలిసిందే. అందుకే ఈమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తారు.ఈమెకు ఆ ఇమేజ్ ను తెచ్చిపెట్టిన చిత్రం ‘కర్తవ్యం’. 1990 వ సంవత్సరం జూన్ 29న ‘కర్తవ్యం’ విడుదలైంది. మోహన్ గాంధీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మించాడు.సిన్సియర్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించారు విజయశాంతి.
ఓ విధంగా ఆమె ‘జంజీర్’ లో అమితాబ్ ను తలపించేలా.. కాదు కాదు అతన్ని కూడా ఢీ కొట్టేలా నటించిందని చెప్పొచ్చు. వినోద్ కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు. సీనియర్ ఎన్టీఆర్ వియ్యంకుడు అయిన అట్లూరి పుండరీకాక్షయ్య ఈ చిత్రంలో విలన్‌గా నటించారు.స్టార్ హీరోయిన్ మీనా కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. రూ.1 కోటి బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం.. అప్పటి రోజుల్లో రూ.7 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఎ.ఎం.రత్నం… నిర్మించిన మొదటి చిత్రం ఇది. అంతకు ముందు ఈయన మేకప్ మెన్ గా పనిచేసేవారు. ‘తేజస్విని’ పేరుతో ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు ఈ చిత్రంలో విజయశాంతి నటనకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కడం విశేషం.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!