నవంబర్ 20న అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. హీరో ఆనంద్ దేవరకొండ రెండో చిత్రంతోనే హిట్టు కొట్టడంతో.. అతని అన్నయ్య విజయ్ దేవరకొండ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రియల్ లైఫ్ కు చాలా దగ్గరగా ఉండి.. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు వినోద్ అనంతోజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వర్ష బొల్లమ వంటి వారి నటనతో పాటు హీరో తండ్రి..
కొండల రావు పాత్ర సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ప్రేక్షకులు ఈ పాత్రకే ఎక్కువ కనెక్ట్ అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పాత్రను పోషించిన నటుడి పేరు గోపరాజు రమణ. ఈయన ఒక థియేటర్ ఆర్టిస్ట్. మొదట ఈయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘గ్రహణం’ చిత్రంలో నటించారు. అటు తరువాత కూడా ఇంద్రగంటి డైరెక్ట్ చేసిన ‘అష్టా చమ్మా’, ‘గోల్కొండ హై స్కూల్’ వంటి సినిమాల్లో కూడా నటించారు.
‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ లో బాలకృష్ణ గురువు పాత్రను పోషించింది కూడా గోపారాజే..! 25 సంవత్సరాలుగా ఈయన సినీ పరిశ్రమలో ఉన్నాడట. సినిమాలకు అలాగే పలు సీరియల్స్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేసాడట గోపరాజు. అయితే ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చిత్రం ఇతనికి మంచి బ్రేక్ వచ్చిందట. ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో ఇతనికి ఆఫర్లు కూడా వస్తున్నట్టు సమాచారం.
Most Recommended Video
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?