సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్.రాధా కృష్ణ గారి బర్త్ డే స్పెషల్..!

ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నారు నిర్మాత సూర్య దేవర రాధా కృష్ణ. ఇండస్ట్రీలో అందరూ ఈయన్ని చినబాబు అంటుంటారు. ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ ‘అరవింద సమేత’ ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస సూపర్ హిట్లతో దూసుకుపోతున్న రాధా కృష్ణ గారి పుట్టిన రోజు.. ఈరోజు కావడంతో.. ఈయన గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం రండి :

1) ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెనాలి లో ఓ రైతు కుటుంబానికి చెందిన రాధా కృష్ణ గారు బి. కామ్ చదువుకున్నారు. ఈయన తండ్రి ఓ న్యాయవాది. అలాగే పార్ట్ టైమ్ లెక్చరర్ కూడా..!

2) రాధాకృష్ణ గారు చదువు పూర్తైన తరువాత ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం సంపాధించారు. ఉద్యోగం చేసుకునే రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసేవారు. అయితే ఈయనకు నిర్మాతగా మారి విలువలతో కూడిన సినిమాని నిర్మించాలని కోరిక. దాంతోనే ఆహుతి ప్రసాద్ వంటి నటుల సాయంతో ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించారు.

3) అటు తరువాత 1988లో మధుసూదన్ రావు గారి డైరెక్షన్లో ‘ఆత్మకథ’ అనే చిత్రాన్ని నిర్మించారు. శరత్ బాబు, జయసుధ, కుష్బూ, శుభలేఖ సుధాకర్ వంటి అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ చిత్రం కోసం రాధాకృష్ణగారు తన స్నేహితుల దగ్గర అలాగే తన సోదరి దగ్గర అప్పుచేసారు.అలాగే ఉద్యోగం చేస్తూ ఆయన సంపాదించిన డబ్బుని కూడా ఈ సినిమా నిర్మించడానికి పెట్టారట. తరువాత అప్పు తీర్చడం కోసం మళ్ళీ ఉద్యోగం చెయ్యడం మొదలు పెట్టారు రాధా కృష్ణ. మొత్తానికి మొదటి చిత్రానికి చేసిన అప్పులు తీర్చేసారు.

4) మళ్ళీ 22ఏళ్ళ తరువాత డి.వి.వి దానయ్య గారి సినిమాలకు సహనిర్మాతగా పనిచేశారు. అలా చేసిన ‘జులాయి’ కెమెరా మెన్ గంగతో రాంబాబు’ ‘నాయక్’ వంటి చిత్రాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి.

5) ఇక ‘జులాయి’ టైములో త్రివిక్రమ్, బన్నీలతో ఏర్పడిన స్నేహం వల్ల.. రాధాకృష్ణకు ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రానికి సోలో ప్రొడ్యూసర్ గా చేసే అవకాశం దక్కింది.

6) సినిమా వల్ల లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రాధాకృష్ణ గారు.. మంచి విలువలు ఉన్న సినిమాలు చేస్తే చాలు అని అనుకుంటారు. అందుకే దర్శకుడు త్రివిక్రమ్ ఆలోచనలు.. రాధా కృష్ణగారికి దగ్గరగా ఉండడంతో వరుసగా ఆయనతో సినిమాలు చేస్తుంటారట.

7) రాధా కృష్ణ గారి అన్నయ్య కొడుకు అయిన సూర్య దేవర నాగవంశీ కూడా.. ఈయన సపోర్ట్ తో ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ ను స్థాపించి ‘ప్రేమమ్’ ‘జెర్సీ’ ‘భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. రాధా కృష్ణ గారి స్నేహితుడు అయిన పి.డి.వి ప్రసాద్ కూడా ఈ రెండు బ్యానర్లలో రూపొందే సినిమాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కపెడుతుంటారు. ప్రస్తుతం రాధా కృష్ణగారు మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఎన్టీఆర్ 30’ ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus