ప్రముఖ నటి ఇంట్లోకి ఓ ఆగంతకుడు ఆయుధాలతో ప్రవేశించి దాడి చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మరాఠీలో క్రేజీ నటిగా పేరొందిన సోనాలి కులకర్ణి ఇంట్లోకి.. తాజాగా ఓ ఆగంతకుడు ఆయుధాలతో చొరబడడం జరిగింది. మంగళవారం నాడు రాత్రి ఆమె ఇంటి టెర్రస్ పై నుండి నేరుగా ఇంట్లోకి ప్రవేశించాడు ఆ దుండగుడు. అక్కడే ఉన్న పనిమనిషిని చూసిన ఆ దుండగుడు..తన వద్ద ఉన్న కత్తితో ఆమెను బెదిరించాడు. ‘నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెంటపడుతున్నారు..
ఎక్కడ దాక్కోవాలో చెప్పు.. లేదంటే ఈ కత్తితో నీ పై దాడి చేస్తా’ అంటూ ఆమెను బెదిరించాడు. చేసేది ఏమీ లేక ఆ టైం లో ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. అయితే అదే టైంకి అక్కడకు వచ్చిన సోనాలి తండ్రి మనోహర్ ఆ ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో అతని పై దాడి చేయగా.. మనోహర్ గాయాలు పాలయ్యాడు.
ఈ క్రమంలో ఆ దుండగుడు పారిపోయేందుకు ప్రయత్నించగా… మనోహర్ పెద్దగా అరవడం వలన కాలనీవాసులు వెంటనే అక్కడికి పరిగెత్తుకొని వచ్చి ఆ దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒక ఫేక్ గన్ మరియు ఓ కత్తిని అతని దగ్గర నుండీ స్వాధీనం చేసుకున్నారు. అయితే అతను నటి సోనాలి ఇంట్లోకి ఎందుకు ప్రవేశించాడు? అతను ఎవరు? అతని కథేంటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.