‘తిమ్మరుసు’ ప్రీ రిలీజ్ వేడుకలో థియేటర్ల గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పాడు హీరో నాని. దీని పై అతన్ని చాలా మంది ప్రశంసించారు. మరికొంతమంది అయితే విమర్శలు గుప్పించారు. ఏదేమైనా ఆ టాపిక్ అక్కడితో అయిపోయింది కదా అని అంతా అనుకున్నారు. కాదు అది చాలా వరకు వెళ్ళింది. అసలు మేటర్ లోకి వెళ్తే.. నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే నాని నటించిన మరో ప్రెస్టీజియస్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ కు కూడా రూ.50 కోట్ల ఓటిటి ఆఫర్ వచ్చింది.
అయితే ఆ చిత్రం మేకర్స్ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. అయితే థియేటర్ల గొప్పతనం గురించి అంతలా చెప్పి ఇప్పుడు మళ్ళీ ఓటిటికి వెళ్లడం ఏంటి అంటూ నానిని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ ట్రోల్స్ కు నాని హర్ట్ అయ్యాడు. ‘నన్ను ట్రోల్ చేసే వారికి ఒకటే చెబుతున్నాను.. నన్ను మీరు ట్రోల్ చేసినా నేను ఫీలవ్వను. అలాగే నిర్మాతల శ్రేయస్సు కోసం నేను వారి నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత నా పై ఉంది’ అంటూ ఓ లేకను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఈ క్రమంలో నాని చేస్తున్న దాంట్లో ఎటువంటి తప్పు లేదని కొందరు విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.
థియేటర్ల గొప్పతనం గురించి.. దాని పై బ్రతికే వారి గురించి నాని తన అభిప్రాయాన్ని చెప్పాడు. అలాగే ‘టక్ జగదీష్’ ను థియేటర్లలో రిలీజ్ చేయించడం కోసం పారితోషికాన్ని కూడా వెనక్కి ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేట్రికల్ రిలీజ్ ఇచ్చినా రూ.10 కోట్ల లోపు బిజినెస్ అయిన సినిమాలే సేఫ్ అవుతాయి. నాని సినిమాకి రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టారు. థియేట్రికల్ రిలీజ్ ఇచ్చినా సేఫ్ అయ్యే ఛాన్స్ లేనప్పుడు నిర్మాత ఓటిటి రిలీజ్ వలన లాభపడితే అందులో ఎలాంటి తప్పు లేదు. నానిని ట్రోల్ చేయడం మాత్రం చాలా తప్పు’ అంటూ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!