‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ .. ఎవ్వరూ గమనించని 10 విషయాలు..!

  • December 9, 2021 / 06:50 PM IST

‘బాహుబలి’ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ మరియు పాన్ ఇండియా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. మూడున్నరేళ్ల నుండీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జనవరి 7న సంక్రాంతి కానుకగా అదీ భారీ పోటీ నడుమ విడుదల కాబోతుంది. ఇప్పటివరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రోమోస్ మరియు గ్లిమ్ప్స్ అప్పటివరకు ఉన్న హైప్ ను డబుల్ చేశాయనే చెప్పాలి. తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చెయ్యడం అది యూట్యూబ్ లో అసాధారణమైన రికార్డులు నెలకొల్పడం జరిగింది. ఈ ట్రైలర్ గురించి ఒక్క మాటలో అద్బుతమనే చెప్పాలి. అభిమానులకి ఓ ఐ ఫీస్ట్ లా అనిపించింది ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్. అయితే ఈ ట్రైలర్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

1) స్కాట్ గవర్నర్ వారు మా అదిలాబాద్ వచ్చినప్పుడు ఓ చిన్న పిల్లని తీసుకొచ్చారు. మీరు తీసుకొచ్చింది గోండు తెగకు చెందిన పిల్లనండి అంటూ రాజీవ్ కనకాల ఓ డైలాగ్ చెబుతాడు. ‘యమదొంగ’ సినిమా తర్వాత రాజీవ్.. రాజమౌళి సినిమాలో కనిపించలేదు. సుమారు 13ఏళ్ళ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ లో కనిపిస్తున్నాడు.

2) గోండు తెగను కాపాడుకునే రక్షకుడు ఎన్టీఆర్ అని ఓ హింట్ ఇస్తూ అతన్ని పరిచయం చేశారు. పులిని వేటాడుతున్నట్టో లేక పులితో ఆడుకుంటున్నట్టో… ఓ విజువల్ ను చూపించారు.

3) పులిని పట్టుకోవాలంటే ఓ వేటగాడు కావాలి… అంటూ మరో డైలాగ్ రాగానే రాంచరణ్ ఎంట్రీ ఉంది. బ్రిటీష్ వాళ్ళు లీగల్ గా భీమ్ ను కట్టడి చెయ్యడానికి చరణ్ ను దింపినట్టు తెలుస్తుంది. కాబట్టి వీళ్ళు ఎదురుపడినప్పుడు ఓ భారీ ఫైట్ ఉంటుందని స్పష్టమవుతుంది.

4) కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు మధ్య ఫైట్ సీక్వెన్స్ దెబ్బ దెబ్బ అన్నట్టు ఉండడమే కాకుండా… ఎంతో ఎమోషనల్ గా కూడా సాగుతుందని ఇన్సైడ్ టాక్. ఆ వెంటనే వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడుతుంది. అలాంటి విజువల్ ను కూడా ఇందులో చూపించారు.

5) అనంతరం వాళ్ళు బ్రిటీష్ సామ్రాజ్యం పై దండయాత్ర చేస్తారు. అందుకు అజయ్ దేవగణ్, సముద్రఖని లు వీరికి సహాయం చేస్తున్నట్టు ఓ సిగ్నల్ ఇచ్చారు.

6)సీత పాత్ర పోషిస్తున్న అలియా భట్ పై ఓ బ్రిటిషర్ కాలు చేసుకున్నాడు. ఈ సీన్ వెనుక చాలా ఎమోషన్ దాగి ఉంటుందని స్పష్టమవుతుంది.

7) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సీతారామరాజు.. దేశం కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా దూసుకుపోతుంటాడు.

8) బ్రిడ్జి సీక్వెన్స్ మరియు వాటర్ సీక్వెన్స్ విజువల్ ఫీస్ట్ లా ఉండబోతుందని ట్రైలర్ స్పష్టం చేసింది. వాటి విజువల్స్ కూడా అదుర్స్.

9) అయితే ఇద్దరు లెజెండ్స్ జీవిత కథతో రూపొందిన ఈ చిత్రంలో ట్రాజెడీ క్లైమాక్స్ ఉంటుందా? చివర్లో హీరోలు బ్రతికుంటారా? అనే విషయం పై బోలెడన్ని సందేహాలు రేకెత్తిస్తూ కూడా ట్రైలర్ లోని విజువల్స్ ఉన్నాయి.

10) నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలు కొడదాం పదా.. అనే డైలాగ్ బాక్సాఫీస్ ను పగలగొట్టడమే లక్ష్యం అన్నట్టు ‘ఆర్.ఆర్.ఆర్’ బరిలో దిగుతున్నట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus