“అమలపాల్”పై కోలీవుడ్ వేటు??

  • August 17, 2016 / 09:17 AM IST

తమిళ భామ అమలా పాల్, దర్శకుడు విజయ్ ఇద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, అనుకోకుండా వీళ్ళిద్దరూ విడిపోవాలని డిసైడ్ అయ్యారు. ఇక తమకు విడాకులు కావాలని ఇటీవల కోర్టు మెట్లు కూడా ఎక్కడంతో ఈవిషయం ఓపెన్ సీక్రెట్ గా మారింది. యధావిధిగా కోర్ట్ వీళ్ళిద్దరికీ 6నెలలు టైమ్ ఇచ్చింది.

ఈలోగా తన సినిమాల్లో బిజీగా మారాలి అని అనుకున్న అమలాపాల్ కి అనుకోని షాక్ తగిలింది…అదేమిటంటే…ప్రస్తుతం ధనుష్ తో ఒక సినిమాలో నటించాల్సి ఉంది అమాలా పాల్, అయితే ఆ సినిమాలో దనుష్ తో అమల నటించకూడదు అని ధనుష్‌ మూవీలో నటించే ఛాన్స్ అమలా పాల్ కు ఇవ్వ కూడదని ధనుష్‌ భార్య ఐశ్వర్య ఈ సినిమా దర్శక  నిర్మాతల పై అదే విధంగా తన భర్త ధనుష్ పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతటితో అయిపోయిందా అంటే కాదు, మరో పక్క నుంచి విజయ్ తండ్రి సైతం అమలాపాల్ పై కక్షగట్టినట్లు తెలుస్తుంది, ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయంతో  విజయ్ తండ్రి,  అమలా పాల్ మామ ఎల్.

అలగప్పన్ కోలీవుడ్ లో ఉన్న ప్రముఖదర్శక నిర్మాతలు అందరినీ వ్యక్తి గతంగా కలుస్తూ అమల పాల్ పై ఉన్నవి లేనివీ క్రియేట్ చేసి చెపుతున్నట్లు టాక్.  విజయ్ తండ్రి నిర్మాత, నటుడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో అమలా పాల్ పై బ్యాన్ వేయాలని కొందరు కోలీవుడ్ దర్శక నిర్మాతలు ఇప్పటికే ఒక  నిర్ణయానికి వచ్చినట్టు కోలీవుడ్  సమాచారం. ఇదే జరిగితే ఆమె అమల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారవుతుంది. మరి దీనిపై తమిళ తంబీలు ఎలా ఆలోచిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus