`నిశ్శ‌బ్దం` చిత్రంలో హాలీవుడ్ యాక్ట‌ర్ ‘మైకేల్ మ్యాడ్‌స‌న్’ లుక్

అనుష్క‌ శెట్టి, ఆర్‌.మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే ప్ర‌ధాన పాత్రధారులుగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో హాలీవుడ్‌కి చెందిన న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, ర‌చ‌యిత, ఫొటోగ్రాఫ‌ర్ మైకేల్ మ్యాడ్‌స‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప‌లు హాలీవుడ్ చిత్రాల్లో న‌టించి మెప్పించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. అంత‌ర్జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్ర‌ల‌తో మెప్పిస్తున్న ఈ హాలీవుడ్ న‌టుడు `నిశ్శ‌బ్దం` చిత్రంలో రిచ‌ర్డ్ డికెన్స్ అనే పోలీస్ హెడ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. గురువారం ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.

ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.త్వ‌ర‌లోనే ఈ సినిమా విడుద‌ల తేదీని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన అనుష్క శెట్టి స‌హా ప‌లువురు ఇండియ‌న్స్ యాక్ట‌ర్స్‌, హాలీవుడ్ యాక్ట‌ర్ మైకేల్ మ్యాడ్ స‌న్ వంటి స్టార్స్ న‌టిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందిస్తుండ‌గా షానియ‌ల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus