రామ్ చరణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఉపాసన

  • September 24, 2018 / 05:53 AM IST

రామ్ చరణ్, ఉపాసనలు బిజీ స్టార్స్. సినిమాలతో చెర్రీ బిజీగా ఉంటే.. ఉపాసన తమ వ్యాపార సామ్రాజాన్ని చూసుకోవడంలో క్షణం తీరిక లేకుండా ఉంటారు. అయినా వృత్తి జీవితంలో పడిపోయి.. వ్యక్తిగత జీవితాన్ని దూరం చేసుకుంటే.. మళ్ళీ ఆ అనుబంధం కావాలంటే దొరకదు. ఈ మాట పెద్దల నుంచి నేర్చుకున్నారో.. స్వంతంగా అర్ధం చేసుకున్నారో తెలియదు కానీ.. దొరికిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తుంటారు ఈ దంపతులు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా నిమిత్తం “అజర్ బైజాన్”లో ఉన్నారు. ఈ షెడ్యూల్ దాదాపు నెలరోజుల పాటు జరగనుంది. అక్కడే చెర్రీ ఉండాలి. అతనికి తోడుగా ఉపాసన కూడా వెళ్లిపోయింది. ఇక్కడ వ్యాపారాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి భర్తతో గడపడానికి కేటాయించారు.

ఇద్దరూ సరదాగా గడిపిన క్షణం గురించి ఉపాసన అభిమానులకు పంచుకున్నారు. “‘మిస్టర్ సి (చరణ్).. మంచి రుచికరమైన వంటలు ‘బలవంతంగా నైనా తినిపిస్తాడు. ఆ తర్వాత జిమ్‌కు తీసుకెళ్లి తిన్నది అరిగేదాకా చంపుతాడు. ‘మిస్టర్‌ సితో ఈ ఆదివారం అద్భుతంగా గడిచింది” అని ఉపాసన నిన్న పోస్ట్ చేశారు. అలాగే రెండు ఫోటోలను కూడా జత చేశారు. ఈ ఫోటోలు వారి మధ్య అన్యోన్యతకి నిదర్శనంగా నిలిచాయి. మెగా అభిమానులకు ఇంతకంటే ఆనందం ఏముంటుంది. అందుకే ఆనందంతో లైకులు, షేర్లు చేస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న రామ్ చరణ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus