Upasana: మహేష్‌ – రాజమౌళి సినిమా పుకార్లు… ఉపాసన క్లారిటీ ఇచ్చేశారుగా!

రాజమౌళి (S. S. Rajamouli) – మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలో హీరోయిన్‌ ఎవరు? ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హైదరాబాద్‌ ఎందుకొచ్చింది? ఈ రెండు ప్రశ్నలు గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉన్నాయి ఈ రెండూ కలుపుకుంటే ఆన్సర్‌ వచ్చేస్తుంది కానీ. ఎవరూ ఈ విషయంలో కన్ఫామ్‌గా చెప్పడం లేదు. ఆ మాటకొస్తే చెప్పరు కూడా అనుకోండి. అయితే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరన్‌ (Ram Charan) భార్య ఉపాసన (Upasana) కొణిదెల రిప్లైతో ఆన్సర్‌, క్లారిటీ రెండూ వచ్చేశాయి.

Upasana

ప్రముఖ బాలీవుడ్ / హాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా ఇటీవల హైదరాబాద్‌ వచ్చింది. మహేష్‌ – రాజమౌళి సినిమా లుక్‌ టెస్ట్‌ కోసమో, ఫొటో షూట్‌ కోసమో ఆమె వచ్చి ఉండొచ్చు అనే వార్తలు వచ్చాయి. అనూహ్యంగా ఆమె మంగళవారం చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వచ్చింది. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఆమె తిరిగి వెళ్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. ఈ క్రమంలో ఉపాసనకు థ్యాంక్యూ కూడా చెప్పింది.

అంటే ఆమెకు దర్శనం కోసం ఏర్పాట్లు చేసింది ఉపాసన అయి ఉండొచ్చు. ఎందుకంటే ప్రియాంకకు హైదరాబాద్‌లో పెద్దగా స్నేహితులు లేరు. ‘తుఫాన్‌’ (Zanjeer) సినిమాను రామ్‌చరణ్‌తో చేసిన నేపథ్యంలో చరణ్‌ ఒక్కడే ఆమెకు పరిచయం. అలా ఆమె హైదరాబాద్‌లో చరణ్‌ ఆతిథ్యంలోనే ఉంది అని చెప్పాలి. ఇక్కడితో ఈ వివరాలు వచ్చేశాయి. కానీ ప్రియాంక పోస్టుకు ఉపాసన థ్యాంక్యూ చెబుతూ అసలు విషయం లీక్‌ చేసేశారు.

శ్రీ బాలాజీ ఆశీర్వాదంతో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాను. మనం అంతా మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో శాంతిని చూడాలని కోరుకుంటున్నాను.‌ ఆ భగవత్ స్వరూపుని అనుగ్రహం అనంతం అని ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొస్తే.. ‘‘మీ కొత్త సినిమా సూపర్ సక్సెస్ కావాలి.. ఆ వేంటేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి’’ అని ఉపాసన రాసుకొచ్చారు. అంటే ప్రియాంక సినిమా పని మీదే ఇక్కడకు వచ్చింది. అయితే మహేష్‌ సినిమా అని ఎవరూ చెప్పలేదు. అయినా ప్రియాంక నటించే స్థాయి సినిమా ఇప్పుడు అదొక్కటే మరి.

విశాల్‌తో యాక్షన్‌ డైరక్టర్‌.. కాంబో ఆల్మోస్ట్‌ రెడీ.. మరి ఆ సినిమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus