మెగా కోడలు ఉపాసన కామినేని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకు అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి అయినప్పటికీ ఉపాసన సమాజంలో తన వ్యాపార మెళకువలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కామినేని వారసురాలిగా తన బాధ్యతలను నిర్వహించటంలో ఉపాసన ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు. అయితే రీసెంట్ గా ఒక ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నారు ఈవిడ.
అదేంటంటే.. ‘మోస్ట్ పవర్ ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్’ వంటి ప్రెస్టీజియస్ అవార్డు ను సొంతం చేసుకున్నట్టు సోషల్ మీడియా ‘x’ వేదికగా తన సంతోషాన్ని ఈ విదంగా పంచుకున్నారు ఉపాసన. “@business_today ప్రకటించిన Most Powerful Women in Business Award అందుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా అనిపిస్తోంది @NSEIndia,ప్రెగ్నెంట్ గా ఉండటంతో ప్రయాణం చేయలేక,పర్సనల్‌గా హాజరు కాలేకపోయాను. ఈ గుర్తింపు ప్రతిరోజు మమ్మల్ని ఇంకా ఎక్కువగా స్ఫూర్తినిస్తోంది అని అన్నారు”.
అయితే ఈ అవార్డును అందుకోడానికి స్వయంగా హాజరు అవ్వలేకపోయారు. ఎందుకంటే ఉపాసన ప్రస్తుతం గర్భిణిగా ఉండటంతో, ఈ మధ్య తాను ఇంటి నుంచే తన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తుంది. రామ్ చరణ్ తో వివాహం అయిన చాలా గ్యాప్ తరువాత 3 సంవత్సరాల క్రితం తమ తోలి సంతానంగా ‘క్లింకార’ జన్మించగా, ప్రస్తుతం కవల బిడ్డలకు జన్మనివ్వబోతున్నట్టు సమాచారం.