Upasana: భర్తతో అమెరికాలో చిల్ అవుతున్న ఉపాసన…ఫోటోలు వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ నామినేషన్ లో ఉండటం వల్ల మార్చి 12వ తేదీన జరుగనుంది. ఈ ఆస్కార్ అవార్డ్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చరణ్ తో పాటు త్రిబుల్ ఆర్ టీం కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా అమెరికాలో సందడి చేస్తున్న రామ్ చరణ్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నాడు. ఇక రామ్ చరణ్ అమెరికాలో ఉండడంతో తాజాగా ఆయన సతీమణి ఉపాసన కూడా అమెరికాకి వెళ్ళింది.

రామ్ చరణ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నప్పటికీ తన భారీ ఉపాసనకు కాస్త టైం కేటాయించి తనతో పాటు సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో బ్యూటిఫుల్ ప్లేస్ కి వెళ్లినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ” మిస్టర్ సి తన బిజీ షెడ్యూల్లో కూడా మాతో సమయాన్ని గడపటం చాలా సంతోషంగా ఉంది. స్నిక్ పీక్ బేబీ మూన్ ” అంటూ రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన గర్భం దాల్చిన తర్వాత మొదటిసారి వీరిద్దరూ ఇలా అమెరికాకు వెళ్లి టైం స్పెండ్ చేయడంతో వారి అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఉపాసన మొదటిసారిగా బేబీ బంప్ ఫోటోలను షేర్ చేయడంతో ఈ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ఉపాసన, రామ్ చరణ్ వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి అయ్యాయి. మెగా వారసుడి కోసం అటు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో చిరంజీవి స్వయంగా మెగా వారసుడు రాబోతున్న శుభవార్తని తెలియజేశాడు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రావటంతో అటు మెగా కుటుంబ సభ్యులతో పాటు ఇటు మెగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus