సోషల్ మీడియాలో వైరల్ అయిన ఉపాసన ట్వీట్

  • January 11, 2018 / 11:28 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అభిమానులకు తమ గురించి ఆప్టేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సంచలనం అయింది. ఎందుకంటే ఆమె ఈసారి ట్వీట్ చేసింది అజ్ఞాతవాసి సినిమా గురించి కాబట్టి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయింది. మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలక్షన్ల జోరు కొనసాగిస్తోంది.

ఈ సినిమాని ఉపాసన అమెరికాలో చూసింది. వెంటనే సినిమాపై అభిప్రాయాన్ని వెల్లడించింది. ” అమెరికాలో ఇప్పుడే అజ్ఞాతవాసి సినిమాని చూసాను. సినిమాని చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన మిస్టర్ సి(రామ్ చరణ్) కి థాంక్స్. “కొణిదెల మ్యాజిక్”” అంటూ ఆమె పోస్ట్ చేసింది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గురించి చెప్పకుండా.. రామ్ చరణ్ గురించి మాత్రమే చెప్పిందని ఆమెపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది పవన్ కళ్యాణ్ కొణిదెల హీరో కాబట్టి.. అతని మ్యాజిక్ ఈ సినిమా అని సంతోషపడుతున్నారు. ఉపాసన ఉద్దేశం ఏంటో తెలియక.. ఇలా రకరకాలుగా అభిమానులు, నెటిజనులు కామెంట్స్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus