మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ‘లూసిఫర్’ రీమేక్ ను మొదలుపెట్టనున్నారు. మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా తరువాత చిరు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయాల్సివుంది. అయితే ‘లూసిఫర్’కు బాబీ సినిమాకు మధ్య వేరే సినిమా చేసే ఆలోచనలో మెగాస్టార్ ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుండి తన సినిమా షూటింగ్ ఉంటుందని బాబీ చెబుతున్నారు.
కానీ ‘లూసిఫర్’ రీమేక్ పూర్తయ్యేవరకు మరో సినిమాను మొదలుపెట్టే ఆలోచన మెగాస్టార్ కి లేదని తెలుస్తోంది. ‘లూసిఫర్’ తరువాత కూడా ‘వేదాళం’ సినిమా ముందుగా టేకప్ చేస్తారట. అలానే ఓ ఫ్యామిలీ స్టోరీ చేసే ఆలోచన కూడా చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు అందించే డైరెక్టర్ చెప్పిన లైన్ మెగాస్టార్ కు బాగా నచ్చిందట. ‘ఆచార్య’, ‘లూసిఫర్’ రీమేక్, ‘వేదాళం’ వంటి సీరియస్ సినిమాల తరువాత మళ్లీ బాబీతో భారీ సినిమా చేయాలా..?
లేక ఫ్యామిలీ సబ్జెక్ట్ ను టేకప్ చేయాలా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ వస్తే బాబీ సినిమా ఈ ఏడాదిలో మొదలవుతుందో లేదో తెలుస్తుంది.