Radhe Shyam Movie: ‘రాధే శ్యామ్’ కొత్త రిలీజ్ డేట్ ను ఆరోజే ప్రకటిస్తారట..!

  • July 27, 2021 / 03:42 PM IST

ప్రభాస్ నటిస్తున్న 4 సినిమాలు ఇప్పుడు సెట్స్ పై ఉన్నాయి.ఇందులో ముందుగా ప్రేక్షకుల ముందుకు రాబోయేది ‘రాధే శ్యామ్’ అనడంలో సందేహం లేదు. నిజానికి ఈ చిత్రాన్ని జూలై 30న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు 2021 ఆరంభంలో ప్రకటించారు. కానీ కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఈ చిత్రం షూటింగ్ మళ్ళీ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. దాంతో జూలై 30న ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని రెండు నెలల క్రితం నుండే వార్తలు వచ్చాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం.. అదే డేట్ న ‘రాధే శ్యామ్’ టీం ఓ సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారని వినికిడి. కొంచెం డీప్ గా వెళ్తే.. అది ‘రాధే శ్యామ్’ కొత్త రిలీజ్ డేట్ గురించి అని తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది.ఈ ఒక్క షెడ్యూల్ కనుక ఫినిష్ అయితే.. షూటింగ్ మొత్తం పూర్తయిపోయినట్టే..! ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే ముందే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు ఈ చిత్రం ఫినిష్ అవ్వలేదు.

కానీ ప్రభాస్ దీనితో పాటు మరో 3 సినిమాల షూటింగ్ లను ప్రకటించేసి.. వాటి షూటింగ్లలో పాల్గొంటున్నాడు. ఇక ‘రాధే శ్యామ్’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus