మెగా పవర్ స్టార్ రాంచరణ్ (Ram Charan) 3 ఏళ్ళు కష్టపడి ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా చేశాడు. శంకర్ (Shankar) దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద ప్లాప్ గా మిగిలిపోయింది. చరణ్ ఫ్యాన్స్ కూడా ఆ సినిమా వల్ల బాగా హర్ట్ అయ్యారు.అల్లు అర్జున్ అభిమానులకి, యాంటీ ఫ్యాన్స్ కి వారు అడ్డంగా దొరికిపోయినట్టు అయ్యింది. నిర్మాత దిల్ రాజు (Dil Raju). కొద్దో గొప్పో కోలుకుని బయటపడ్డారు. ఇప్పుడు చరణ్ కూడా తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.
బుచ్చిబాబు (Buchi Babu Sana) దర్శకత్వంలో రాంచరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్ సతీష్ కిలారు.. ‘మైత్రి’ వారితో కలిసి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఎంపికైంది. రెహమాన్ (A.R.Rahman) సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఆయన 3 పాటలు కూడా కంపోజ్ చేసినట్టు బుచ్చిబాబు మొన్నామధ్య చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని..
రామ్ చరణ్ ని సోలో హీరోగా వెయ్యి కోట్ల క్లబ్లో చేరుస్తుంది అంతా భావిస్తున్నారు. అయితే బుచ్చిబాబుకి స్టార్ హీరోని డీల్ చేసే కెపాసిటీ ఉందా? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ‘ఉప్పెన’ (Uppena) కథ, కథనాలు పెద్ద గొప్పగా ఏమీ ఉండవు. అందుకే చాలా మంది బుచ్చిబాబు గురించి భయపడుతున్నట్టు ఉన్నారు. కానీ ‘ఉప్పెన’ కి క్లైమాక్స్ ప్రాణం. సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అదే.
బుచ్చిబాబు సెన్సిబిలిటీ కూడా అందరూ మెచ్చుకునేలా చేసింది. చరణ్ తో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములాని బుచ్చిబాబు అప్లై చేయబోతున్నాడట. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న మూవీ. చరణ్ కి ఒక బలహీనత ఉంటుందట. దాని చుట్టూనే కథ, కథనం నడుస్తుందని వినికిడి . ఈ సినిమా క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట. దాని కోసమైనా ఆడియన్స్ రిపీట్స్ లో సినిమాకి వస్తారని ఇండస్ట్రీ టాక్.