రాపో 22 గురించి ఇంట్రస్టింగ్ అప్డేట్!

రామ్ కి (Ram) అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. ఇటీవల రామ్ నుండి వచ్చిన ‘ది వారియర్’ (The Warriorr) ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి సినిమాలు అవడంతో రేసులో వెనుకపడ్డాడు. ప్రస్తుతం అతను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ( Miss Shetty Mr Polishetty) దర్శకుడు పి.మహేష్ బాబుతో (Mahesh Babu P) ఓ సినిమా చేస్తున్నాడు. గోదావరి బ్యాక్ డ్రాప్లో సాగే కథ ఇది. కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంటుందట. అలాగే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని సమాచారం. ఈ సినిమా ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Upendra, Mohanlal

ఈ సినిమాలో హీరోతో సమానంగా ఒక పాత్ర ఉంటుందట. అందుకోసం సీనియర్ హీరోలైన బాలకృష్ణ (Balakrishna), రజినీకాంత్ (Rajinikanth), అరవింద్ స్వామి (Arvind Swamy) .. వంటి వాళ్ళను టీం అప్రోచ్ అయ్యింది. కానీ వాళ్లు ఆ పాత్రకి నో చెప్పారు అని సమాచారం. దీంతో మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ ను అప్రోచ్ అయ్యారట. అయితే ఈ పాత్ర చేయడానికి మోహన్ లాల్ రోజుకు కోటి రూపాయలు చొప్పున డిమాండ్ చేశాడని టాక్.

జనతా గ్యారేజ్ (Janatha Garage) నిర్మాతలు కాబట్టి, ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ లో కూడా రాణిస్తున్నారు కాబట్టి.. మైత్రి వారికి నో చెప్పలేక ఇలా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశాడు మోహన్ లాల్ (Mohanlal) అని అంతా అనుకుంటున్నారు. దీంతో నిర్మాతలు కూడా మోహన్ లాల్ ని లైట్ తీసుకుని కన్నడ స్టార్ హీరో ఉపేంద్రని (Upendra Rao) సంప్రదించినట్టు తెలుస్తుంది. ఉపేంద్రకి పాత్ర నచ్చడంతో ఓకే చెప్పినట్టు స్పష్టమవుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

‘పుష్ప 3’ ఐటెం సాంగ్.. దేవి మనసులోని మాట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus