SSMB28: త్రివిక్రమ్‌ మళ్లీ ‘సత్యమూర్తి’ స్టార్‌ను తీసుకొస్తున్నారట!

త్రివిక్రమ్‌ సినిమాలో గత తరం నాయికలు, వేరే భాష నుండి కానీ, మన భాష నుండి కానీ సీనియర్‌ స్టార్‌ హీరోలు నటించడం ఓ కాన్సెప్ట్‌లా మారిపోయింది అని మనం గతంలోనే చెప్పుకున్నాం. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ ఆ టైమ్‌ నుండి త్రివిక్రమ్‌ ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్‌బాబు సినిమాలోనూ సీనియర్‌ హీరో, సీనియర్‌ హీరోయిన్‌ ఉంటారని చెబుతున్నారు. ఈ విషయంలో చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మళ్లీ కన్నడ సూపర్‌ స్టార్‌ పేరు వినిపిస్తోంది.

మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాలో తండ్రి పాత్ర ఉందని, సినిమాకే కీలకమైన ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనీల్ కపూర్ నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర పేరు వచ్చింది. ఆ మధ్య మోహన్‌బాబు పేరు కూడా వినిపించింది. ఇంకా కొంతమంది పేర్లు కూడా వినిపించాయి. తాజాగా మళ్లీ ఉపేంద్ర పేరు బయటికొచ్చింది. మహేష్ బాబుకి ఫాదర్‌గా నటించడానికి ఉపేంద్ర ఓకే చెప్పారని అంటున్నారు.

అయితే ప్లాష్ బ్యాక్‌లో మాత్రమే ఉపేంద్ర పార్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఆ లెక్కన మహేష్‌కి, ఉపేంద్రకి ఎలాంటి సీన్స్‌ ఉండవట. మహేష్ బాబు– త్రివిక్రమ్ కలయికలో 11 సంవత్సరాల తర్వాత సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఈ సినిమా చాలా రోజుల నుండి సెట్స్‌పైకి రావడం లేదు. ముహూర్తపు షాట్‌కి క్లాప్ కొట్టి చాలా రోజులైంది. కథపై ఇంకా కూర్చున్నారో, లేక కాస్టింగ్‌పై ఆలోచిస్తున్నారో కానీ సినిమా అయితే మొదలుపెట్టడం లేదు.

హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘పార్థు’, ‘అర్జునుడు’ అనే పేర్లు చర్చలో వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళితో మహేష్‌ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా ఫ్యాన్స్‌ ఇంకా ఎక్కువ వెయిట్‌ చేస్తున్నారు. అందులో మహేష్‌ను ఎలా చూపించబోతున్నారు అని ఆసక్తితో ఉన్నారు. త్రివిక్రమ్‌ సినిమా ఆలస్యం అవుతుండటంతో జక్కన్న సినిమా ఇంకా లేట్‌ అవుతోంది.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus