మొదటి సినిమా రిలీజ్ కాకుండానే.. రెండో సినిమాకు రెడీ అయిపోయిన మెగా హీరో?

  • July 1, 2020 / 09:00 AM IST

సాధారణంగా మొదటి సినిమాతోనే హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలంటే.. అది పెద్ద స్టార్ హీరో కొడుకో.. లేక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకో అయ్యి ఉంటారని అంతా అనుకుంటుంటారు. అయితే ఓ మెగా హీరోకి మాత్రం లక్ పీక్స్ లో ఉందని తాజాగా స్పష్టమైంది. అతనెవరో కాదు మన మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమా ‘ఉప్పెన’ ని ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుకుమార్ రైటింగ్స్’ వంటి పెద్ద బ్యానర్లలో చేసే ఛాన్స్ కొట్టేసాడు.

విజయ్ సేతుపతి వంటి స్టార్ హీరో ఇతని సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. బుచ్చిబాబు సానా డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈపాటికే విడుదల కావాల్సి ఉంది కానీ.. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన రెండు పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో ‘ఉప్పెన’ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా.. ఇంకా మొదటి చిత్రం విడుదల కాకుండానే రెండో చిత్రానికి కూడా రెడీ అయిపోయాడట ఈ మెగా హీరో.

వివరాల్లోకి వెళితే.. ‘యూవీ క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలో తన రెండో చిత్రం చేసే అవకాశం కొట్టేసాడు. స్క్రిప్ట్ చాలా బాగుండడంతో వైష్ణవ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. సాయి తేజ్ కు కూడా ఈ కథ బాగా నచ్చిందట. ఫ్యామిలీ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఈ స్క్రిప్ట్ ఉందని తెలుస్తుంది. త్వరలోనే మావయ్య చిరంజీవికి స్క్రిప్ట్ వినిపించి.. చేంజెస్ ఏమైనా చెబితే డైరెక్టర్ తో మార్పించి.. వెంటనే సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ఈ మెగాహీరోలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Most Recommended Video

మన టాలీవుడ్ డైరెక్టర్లు లేడీ అవతారాలు ఎత్తితే ఇలానే ఉంటారేమో !!
చిరు ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన సినిమాలు ఇవే..!
ఆ డైరెక్టర్లకు ఛాన్స్ ఇచ్చింది మన రవితేజనే..!
మన హీరోలు అందమైన అమ్మాయిలుగా మారితే ఇలాగే ఉంటారేమో!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus