ట్రైలర్ ఎఫెక్ట్ అనుకుంట.. బిజినెస్ బాగానే అయ్యింది.. కానీ?

‘మైత్రి మూవీ మేకర్స్’ మరియు ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ల పై నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సుకుమార్ లు కలిసి నిర్మించిన చిత్రం ‘ఉప్పెన’. మెగా మేనల్లుడు సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన లభించింది. బుచ్చిబాబు సనా చాలా అద్భుతంగా ఈ ప్రేమ కావ్యాన్ని మలిచినట్టు తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర పోషిస్తుండడంతో బిజినెస్ కూడా బాగా జరిగినట్టు ఇన్సైడ్ టాక్. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఉప్పెన’ చిత్రానికి రూ.24కోట్ల భారీ బడ్జెట్ అయ్యిందట. ఓ కొత్త హీరో సినిమాకి ఈ బడ్జెట్ చాలా ఎక్కువనే చెప్పాలి..! కరోనా రాకపోయి ఉంది ఉంటే కనుక.. గతేడాది ఏప్రిల్ లోనే ఈ చిత్రం విడుదలయ్యి ఉండేది. కానీ కుదర్లేదు.

ఆ టైములో ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యమని ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పుడు కేవలం రూ.13కోట్లు మాత్రమే రేటు పలికిందట. డిజిటల్ రిలీజ్ ఇస్తే శాటిలైట్ హక్కులు 6 కోట్లకు మించి రావడం లేదట. దాంతో రూ.5 కోట్లు నష్టం వస్తుందని నిర్మాతలు లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకోవడమే ఇప్పుడు ఈ చిత్రానికి మంచిదయ్యింది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ కే తెలుగు రాష్ట్రాల్లో రూ.18కోట్లు పలికిందట. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో 9కోట్ల వరకూ వచ్చాయని వినికిడి. ఏదేమైనా నిర్మాతలు మాత్రం లాభాల బాట పట్టారని సమాచారం.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?</strong

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus