హీరోయిన్ ఛాన్సులు వద్దంటున్న ఐటెం గాళ్.!

సినీ పరిశ్రమకు చెందిన ఏ ఫిమేల్ ఆర్టిస్ట్ అయినా ఛాన్స్ దొరికితే హీరోయిన్ గా చేసి.. పాపులర్ అవ్వాలని భావిస్తుంది. ఒకవేళ ఛాన్స్ లు కనుక రాకపోతే ఐటెమ్ బ్యూటీ గానో లేక సెకండ్ హీరోయిన్ గానో నటించడానికి డిసైడ్ అవుతారు. చాలా వరకు పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వస్తే అదే బెటర్ అనుకునేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే పాత్ర బాగుంది అంటే చిన్న, మిడ్ రేంజ్ సినిమాల్లో మెయిన్ హీరోయిన్ ఛాన్సులు వస్తాయి అని..!

కానీ ఓ ఐటెం గాళ్ కి మాత్రం ‘హీరోయిన్ ఛాన్స్ ఇస్తాము అంటూ’ దర్శక నిర్మాతలు వెంటపడినా ఆమె మాత్రం నో చెబుతుంది. వినడానికి షాకింగ్ గా ఉంది కదూ..! అయినప్పటికీ ఇది నిజం. ఆమె మరెవరో కాదు ఊర్వశి రౌతేలా. ఇప్పటివరకు ఆమె 17 సినిమాల్లో నటించింది.కొన్ని సినిమాల్లో అయితే జస్ట్ నర్తించింది అంతే..! హిందీతో పాటు తెలుగు, తమిళ, బెంగాలీ భాషల్లో ఆమె చేసిన చిత్రాల సంఖ్య ఇది.

అయితే ఈమె హీరోయిన్ గా చేసిన సినిమాలు కేవలం 5 మాత్రమే. తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’లో ‘బాస్ పార్టీ’, ‘ఏజెంట్’ లో ఒక ఐటెం సాంగ్, ఇటీవల ‘బ్రో’ సినిమాలో ఓ ఐటెం సాంగ్, ‘స్కంద’ లో ఓ ఐటెం సాంగ్ లు చేసింది. ఈమె ఓ ఐటెం సాంగ్ చేయడానికే కోట్లల్లో పారితోషికం అందుకుంటుంది. పైగా ఎక్కువ కాల్ షీట్లు కూడా ఇవ్వనవసరం లేదు. అదే హీరోయిన్ గా చేసి.. ఆ సినిమా కనుక ప్లాప్ అయితే దర్శక నిర్మాతలు ఈమెను (Urvashi Rautela) లైట్ తీసుకుంటారేమో అనేది ఈమె భయం కావచ్చు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags