Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ustaad Bhagat Singh: ఆ దర్శకుడు గట్టిగా ప్లాన్ చేశారుగా!

Ustaad Bhagat Singh: ఆ దర్శకుడు గట్టిగా ప్లాన్ చేశారుగా!

  • April 26, 2023 / 04:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustaad Bhagat Singh: ఆ దర్శకుడు గట్టిగా ప్లాన్ చేశారుగా!

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ మే 11న విడుదలైంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన సూపర్ డూపర్ హిట్ సినిమా ‘గబ్బర్ సింగ్’ విడుదల తేదీ గుర్తు ఉందా? మే 11 తమ అభిమాన కథానాయకుడిని ప్రేక్షకులు అందరూ ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నారో, ఆ విధంగా చూపించిన క్రెడిట్ దర్శకుడు హరీష్ శంకర్ సొంతం.

పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇండస్ట్రీ హిట్స్, సూపర్ హిట్స్ ఉన్నాయి. ఆ సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ది స్పెషల్ ప్లేస్! అందుకనే, ప్రతి ఏడాది మే 11 వచ్చిందంటే చాలు… పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో ట్రెండ్స్ సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ‘గబ్బర్ సింగ్’ రిలీజ్ డేట్ మరింత స్పెషల్ కాబోతోంది. ఎందుకంటే… మే 11న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గ్లింప్స్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో రూపొందుతోన్న లేటెస్ట్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ విడుదలైన మే 11న ఈ సినిమా గ్లింప్స్ విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులకు, ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇచ్చేలా ఆ గ్లింప్స్ ఉండబోతుందని తెలిసింది. అన్నట్టు… ఈ ఏడాదికి ‘గబ్బర్ సింగ్’ విడుదలై 11 ఏళ్ళు అయ్యింది.

ఇటీవల హైదరాబాదులో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. అందులో కథానాయిక శ్రీలీల కూడా పాల్గొన్నారు. హీరో హీరోయిన్లతో కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ ఫైట్ తెరకెక్కించారు. స్టంట్ కొరియోగ్రాఫర్లు రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో భారీ యాక్షన్ ఎపిసోడ్ తీసినట్లు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ యూనిట్ తెలియజేసింది. వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా… హై వోల్టేజ్ భారీ యాక్షన్ సీన్లు తీశారు. అవి సినిమాలో హైలైట్ అవుతాయట! కొంత మంది చిన్నారులతో వినోదభరిత సన్నివేశాలు సైతం తెరకెక్కించారు.

పవన్ కళ్యాణ్, శ్రీలీల మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు తీసినట్లు చిత్ర బృందం పేర్కొంది. నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన మేనరిజమ్స్ కూడా అభిమానులకు గుర్తుకు వస్తాయి. హరీష్ శంకర్ సైతం పవర్ స్టార్ ఫ్యాన్ కావడంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో స్పెషల్ మేనరిజమ్స్ క్రియేట్ చేశారట.

అదిరిపోయే డైలాగ్స్, స్పెల్ల్ బైండింగ్ మ్యానరిజంలతో పవన్ కళ్యాణ్‌ ను విభిన్న కోణంలో చూపించి ప్రేక్షకులకు విందు అందించడం గ్యారెంటీ అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ స్టైలిష్ పోస్టర్లు అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Mythri Movie Makers
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

16 mins ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

27 mins ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

1 day ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

26 mins ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

54 mins ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

23 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version