నా శిష్యుడికి పేరు.. నా మిత్రుడికి డబ్బు… ‘గీత’ తెచ్చిపెట్టాలి : వి.వి.వినాయక్

‘గ్రాండ్ మూవీస్’ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం “గీత”. దర్శక సంచలనం వి.వి.వినాయక్ ప్రియశిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. “మ్యూట్ విట్నెస్” అన్నది ఈ చిత్రానికి ఉప శీర్షిక. ఈనెల 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ “తన శిష్యుడు విశ్వకు మంచి పేరు, తన మిత్రుడు రాచయ్యకు డబ్బు తెచ్చే మంచి చిత్రంగా “గీత” నిలవాలని” ఆకాంక్షించారు. వి.వి.వినాయక్ తమ చిత్రం “గీత” ఘన విజయం సాధించాలని అభినందించడం పట్ల నిర్మాత రాచయ్య, దర్శకుడు విశ్వ సంతోషం వక్తం చేశారు. ఈనెల 14న “గీత” చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ టైటిల్ రోల్ ప్లే చేసిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus