పెద్ద రిస్క్ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ వాణి కపూర్..!

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా ఏడేళ్ళ క్రితం వచ్చిన ‘ఆహా కళ్యాణం’ చిత్రం కచ్చితంగా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నానితో ప్రముఖ బాలీవుడ్ సంస్థ ‘య‌ష్‌రాజ్ ఫిల్మ్స్’ వారు నిర్మించిన చిత్రమిది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘బ్యాండ్ బజావో భారత్’ చిత్రానికి ఇది రీమేక్. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. అప్పటికే అనఫీషియల్ గా ఓ బడా నిర్మాత ‘బ్యాండ్ బాజావో భారత్’ చిత్రాన్ని రీమేక్ చేసేసాడు.

అయినప్పటికీ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన వాణీ క‌పూర్… తన గ్లామర్ తోనూ మరియు నటనతోనూ ఆకట్టుకుంది. సినిమా హిట్ అయ్యుంటే ఈమెకు టాలీవుడ్లో మంచి అవకాశాలు వచ్చేవేమో. కానీ తరువాత బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ఓ రిస్కీ రోల్ చెయ్యడానికి ఓకే చెప్పిందట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టిస్తున్న `చండీగ‌ర్ క‌రే ఆషికీ` అనే చిత్రంలో వాణీక‌పూర్ లింగ‌మార్పిడి చేయించుకున్న ట్రాన్స్ జెండ‌ర్‌గా క‌నిపించ‌బోతోందని తెలుస్తుంది.

సినిమాలో ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట.. అందుకే వాణీక‌పూర్ ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ పాత్ర చెయ్యబోతుందని తెలుస్తుంది.మరి ఆమె కష్టం ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus