రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో హీరో అశ్విన్ బాబు, మామిడాల ఎం .ఆర్. కృష్ణ, టి. గణపతి రెడ్డి, అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ లాంచ్
‘వచ్చిన వాడు గౌతమ్’ టీజర్ చాలా బావుంది. ఆడియన్స్ ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే వావ్ ఫ్యాక్టర్ సినిమాలో ఉంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను
డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న యంగ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఎక్సయిటింగ్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’ రాబోతున్నారు. మెడికో థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మామిడాల ఎం .ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అరుణశ్రీ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మాత టి. గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. ప్రవల్లిక యోగి కో – ప్రొడ్యూసర్. ఇప్పటికే విడుదలైన పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్, హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో పాల్గొని పాక్-ఆక్రమిత కాశ్మీరులో శతృవులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందిన వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి నిర్మాత చెక్ అందించారు.
“ధర్మం దారి తప్పినప్పుడు… ఏ అవతారం రానప్పుడు… వచ్చినవాడు గౌతమ్”అంటూ హీరో మనోజ్ మంచు పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్ తో మొదలైన టీజర్ ఓ యాక్ష్ మూడ్‌ను సెట్ చేస్తుంది. మొదటి ఫ్రేమ్ నుంచే టీజర్ కట్టిపడేస్తుంది. గౌతమ్ పాత్రలో అశ్విన్ బాబు కనిపించిన తీరు పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్ గా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టైమింగ్ అన్నీ ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తదనాన్ని పంచుతుండగా, ఎమోషనల్ ఇంటెన్సిటీ కథలో ఉన్న డెప్త్‌ను తెలియజేస్తుంది.
దర్శకుడు మామిడాల ఎం.ఆర్. కృష్ణ ఈ చిత్రాన్ని ఓ రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా కాకుండా, కొత్త కాన్సెప్ట్‌తో తెరపై తీసుకురావాలని టీజర్ నుంచే అనిపిస్తున్నారు. టీజర్ విజువల్స్‌ని మించిపోయేలా ఎం.ఎన్. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ యాక్షన్ థ్రిల్‌ని కలిపి చూపిస్తుంది. గౌర హరి అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు ఇంటెన్స్ ని ఇచ్చింది. టెక్నికల్ స్టాండర్డ్స్ చూస్తేనే సినిమా నిర్మాణ విలువలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. మొత్తనికి టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అశ్విన్ నేను ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడకపోతే ఆరోజు గడవదు. నిజానికి అశ్విన్ గ్రౌండ్ లోకి వస్తే నాకు చాలా అసలు నచ్చదు. తను బాదుడుకి బాలు పట్టుకుంటే చేతులు నొప్పిపుడతాయి( నవ్వుతూ) మేము ఎమోషనల్ గా చాలా బాండ్ అయ్యాం. తను పాజిటివ్ గా ఉంటాడు. ఈ సినిమా టీజర్ చాలాసార్లు చూశాను. హరీ గౌర హనుమాన్ తో చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో పేరు రావడం అంత ఈజీ కాదు. ఈ సినిమా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కృష్ణ గారి ఫ్రేమ్స్ చూస్తుంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ల అనిపించలేదు. బాల్ రెడ్డి గారు బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమాని తీశారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది’అన్నారు
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కృష్ణ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. డెఫినెట్ చాలా కొత్త పాయింట్. మీరు ఊహించలేని పాయింటు. అది మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుందని భావిస్తున్నాను. మంచు మనోజ్ అన్నకి థాంక్యూ సో మచ్. ఆయన వాయిస్ టీజర్ కి ప్రాణం పోసి మరో స్థాయికి తీసుకెళ్ళింది. నిర్మాత గణపతి రెడ్డి గారి పేరు ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయనతో ఈ సినిమా చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా ఇంత గ్రాండ్ గా రావడానికి కారణం ఆయన సపోర్టు. బాల్ రెడ్డి గారి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. టెక్నికల్ టీం అందరికీ థాంక్యు. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. ఈ టీజర్ హిట్ డైరెక్టర్ శైలేష్ కోలను గారి చేతుల మీద లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తమన్ అందరికీ మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు. నాకు మాత్రం తను ఒక ఎమోషన్. తను నాకు గాడ్ గిఫ్ట్. తను నా జీవితంలో ఉండడం వెరీ లక్కీ. మా టీజర్ ని సక్సెస్ చేసినందుకు అందరికీ థాంక్యూ’అన్నారు
డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. టీజర్ కట్ చాలా బాగుంది. అశ్విన్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. తనతో కలిసి వర్క్ చేయాలనే ఉంది. నిర్మాత గణపతి గారి పాజిటివ్ ఎనర్జీ నాకు చాలా నచ్చింది. అందుకే ఈవెంట్ కి వచ్చాను. మెడికల్ థ్రిల్లర్ ఎప్పుడు కూడా గ్రేట్ కాంబినేషన్. ఈ కథ కూడా నాకు అలాగే అనిపిస్తుంది. బాల్ రెడ్డి గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హరి గౌర మ్యూజిక్ చాలా బావుంది. డైరెక్టర్ కృష్ణ కి ఆల్ ద వెరీ బెస్ట్. ఏదో ఒక వావ్ ఫ్యాక్టరీ ఉంటేనే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. ఈ సినిమాలో అలాంటి వావ్ ఫ్యాక్టర్ వుంది అనిపించింది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమా థియేటర్స్ లో చూడడానికి ఎదురుచూస్తున్నాను. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’అన్నారు.
హీరోయిన్ రియా మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. చాలా మంచి కాన్సెప్ట్ థ్రిల్లర్ వున్న సినిమా ఇది. నిర్మాత చాలా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో సినిమా తీశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్ యూ. అశ్విన్ బెస్ట్ కో స్టార్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’అన్నారు.
డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ… టీజర్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం హీరో అశ్విన్ బాబు గారు. నన్ను నమ్మి ట్రావెల్ చేశారు. అలాగే డీవోపీ బాల్ రెడ్డి గారు, మ్యూజిక్ హరి గౌర గారు, మా టీం అంత అద్భుతమైన వర్క్ ఇచ్చారు అందుకే ఇంత మంచి టీజర్ వచ్చింది’అన్నారు
నిర్మాత గణపతి రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. హిట్ దర్శకులు శైలేస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారికి థాంక్ యూ. టీజర్ చూసిన తర్వాత గూస్బంప్స్ వచ్చాయి. అశ్విన్ గారు సినిమా కోసం చాలా కష్టపడ్డారు. దర్శకుడు కృష్ణ విజువల్స్ టేకింగ్ అదరగొట్టారు. హరి గారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. చాలా మంచి టీంతో పని చేశాం. ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను.
మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మాట్లాడుతూ.. టీజర్ సౌండ్ చాలా బావుందని అనే కాంప్లిమెంట్స్ రావడం చాలా ఆనందాన్ని ఇస్తోంది. తమన్ గారి బాటలోనూ నేను వెళ్తున్నాను. ఈ వేడుకకు ఆయన రావడం చాలా హ్యాపీగా వుంది.
నిర్మాత కేఎస్ రామారావు మాట్లాడుతూ.. టీజర్ డైనమిక్ అండ్ ఫెంటాస్టిక్ గా వున్నాయి. అశ్విన్ యాక్షన్ అద్భుతంగా చేశాడు. నిర్మాత గణపతి రెడ్డి గారి శుభాకాంక్షలు. టీజర్ చూస్తుంటే సినిమా చాలా బావుంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమాని తప్పకుండా జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఈ సినిమాని థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.’అన్నారు.
కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. టీజర్ చాలా ఎక్సయిటింగ్ గా వుంది. అశ్విన్ బాబు, డైరెక్టర్ కృష్ణ, టీం అంతా అద్భుతంగా చేశారు. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’అన్నారు
నటీనటులు: అశ్విన్ బాబు, రియా సుమన్, అయేషా ఖాన్, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, అజయ్,VTV గణేష్, యెష్నా చౌదరి, సుదర్శన్, శకలక శంకర్, రాఘవ,అభిత్ భూషణ్,నాగి
సాంకేతిక నిపుణులు :
స్టోరీ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ : మామిడాల ఎం. ఆర్. కృష్ణ
నిర్మాత : T. గణపతి రెడ్డి’
కో – ప్రొడ్యూసర్ : ప్రవల్లిక యోగి
లైన్ ప్రొడ్యూసర్ : T. బద్రి నాధ్ రెడ్డి
బ్యానర్ : అరుణ శ్రీ ఎంటర్టైన్మెంట్స్
డీవోపీ : ఎం. ఎన్ బాల్ రెడ్డి,
మ్యూజిక్ : గౌర హరి
ఎడిటింగ్ : M R వర్మా
ఫైట్స్ : పృథ్వి, రామకృష్ణ
ఆర్ట్ : సురేష్ భీమగని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : A.దుర్గేష్
కో – డైరెక్టర్ : U. కృష్ణ కిషోర్
పబ్లిసిటీ డిజైన్: అనిల్ భాను
పీఆర్వో : తేజస్వి సజ్జా