వడ్డే నవీన్ అందరికీ సుపరిచితమే. అప్పట్లో గ్లామర్ బాయ్ గా చాలా ప్రేమకథల్లో నటించారు. ‘కోరుకున్న ప్రియుడు’ ‘స్నేహితులు’ ‘మనసిచ్చి చూడు’ ‘పెళ్లి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తర్వాత ‘చాలా బాగుంది’ ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. తర్వాత వరుస ప్లాపులు పలకరించడంతో సినిమాలు తగ్గించారు.
మధ్యలో పలు సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చినా ఎందుకో నిలదొక్కుకోలేక పోయారు. ఇక వడ్డే నందమూరి అల్లుడు అనే సంగతి తెలిసిందే. నందమూరి రామకృష్ణ తనయ చాముండేశ్వరిని వడ్డే నవీన్ పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే తర్వాత మనస్పర్థల కారణంగా వారు విడాకులు తీసుకున్నారు. అటు తర్వాత బిజినెస్ వ్యవహారాలతో వడ్డే నవీన్ బిజీ అయిపోయారు.
మొన్నామధ్య ‘ఆయ్’ వంటి సినిమాల్లో ఇతనికి ఫాదర్ రోల్స్ ఆఫర్ చేసినా.. చేయలేదు అనే టాక్ వినిపించింది. అయితే నవీన్ త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కానీ ఈసారి హీరోగా కాదు నిర్మాతగా. అవును ‘వడ్డే క్రియేషన్స్’ అనే బ్యానర్ ను స్థాపించి వాటిపై సినిమాలు చేయాలని భావిస్తున్నారట.
ఆల్రెడీ ఆ బ్యానర్ పేరుని రిజిస్ట్రేషన్ చేయించినట్టు కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ బ్యానర్లో తన వారసులతో సినిమాలు నిర్మిస్తారా లేక కొత్త హీరోలతో సినిమాలు నిర్మిస్తారా? అదీ కాదు అంటే సహ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.