స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ తొలుత సినిమాల్లో నటించి, హీరోయిన్‌గా ప్రయత్నించిందనే విషయం తెలిసిందే. టీవీల్లోకి వచ్చి నటి అయ్యి, ఆ తర్వాత యాంకర్ అయింది. ఇప్పుడు ఆమె స్టార్ యాంకర్. అయితే మధ్య మద్యలో సినిమాల్లో నటిస్తోంది. అయితే ఆమె ఎర్లీ డేస్‌లో అంటే సినిమా హీరోయిన్‌గా అవుదాం అనుకునే రోజుల్లో చాలా సినిమాలు దగ్గరకు వరకు వచ్చి మిస్ అయ్యాయి. ఈ విషయం చాలా మందికి తెలిసిందే. అయితే ఏ సినిమాలు మిస్ అయ్యాయి అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
నితిన్ ‘జయం’ సినిమాలో సదా కంటే ముందు హీరోయిన్‌గా అనుకున్నది రష్మినే అని మొన్నీమధ్యే తెలిసింది. రిహార్సల్స్ అయిపోయి, రేపోమాపో షూటింగ్‌కి వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఆ సినిమా నుండి రష్మిని తప్పించేశారు. ఎందుకు, ఏంటి అనేది మనకు తెలియలేదు. ఇప్పుడు మరో రెండు సినిమాల సంగతి బయటకు వచ్చింది. అయితే ఇవి తెలుగువి కావు.. తమిళంలోనివి. సినిమా ట్రయిల్స్‌లో భాగంగా రష్మీ తమిళంలో కూడా ట్రై చేసింది. అప్పుడే ఈ మిస్‌లు జరిగాయి.
విజయ్ ఆంటోని హీరోగా నటించిన తొలి సినిమా ‘సలీమ్’. తెలుగులో ఈ సినిమాను ‘డాక్టర్ సలీమ్’గా రిలీజ్ చేశారు. ఆ సినిమాలో అక్ష హీరోయిన్‌గా నటించింది. అయితే అంతకుముందు ఆ పాత్ర కోసం రష్మిని అనుకున్నారట. ఏమైందో ఏమో ఆ సినిమా ఛాన్స్ పోయింది. ఆ తర్వాత కొన్నేళ్లకు ‘సైతాన్’ / ‘బేతాళుడు’ సినిమాలో కూడా రష్మిని హీరోయిన్‌గా పెడదాం అని అనుకున్నారట విజయ్ ఆంటోని. అప్పుడు కూడా ఏదో కారణం వల్ల అవ్వలేదట.
ఫైనల్‌గా ఇప్పుడు కొత్త సినిమాలో ఈ ఇద్దరూ కలసి నటిస్తున్నారట. అయితే అది విజయ్ ఆంటోని 25వ సినిమా ‘శక్తి తిరుమగన్’, / ‘భద్రకాళి’నా లేక ఆ తర్వాత వచ్చే సినిమానా అనేది తెలియాల్సి ఉంది. అన్నట్లుగా ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ భోలే శావలి రెండు పాటలు కూడా రాస్తున్నారు.