సాయి పల్లవి టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. ‘ప్రేమమ్’ తో ఈమె క్రేజ్ పెరిగింది. తెలుగులో ‘ఫిదా’ తో డెబ్యూ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత ‘ఎం.సి.ఎ’ ‘లవ్ స్టోరీ’ ‘శ్యామ్ సింగ రాయ్’ ‘తండేల్’ వంటి బ్లాక్ బస్టర్స్ ఈమె ఖాతాలో ఉన్నాయి. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ సాయి పల్లవి వరుస సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలనే తపన ఈమెలో ఉండదు.
సినిమాల్లో నటిస్తూనే డాక్టర్ కోర్స్ కూడా కంప్లీట్ చేసింది. డబ్బుల కోసం, స్టార్ స్టేటస్ కోసం సినిమాలు చేయాలని అనుకోదు. మనసుకు నచ్చిన పాత్రలే చేస్తానని పదే పదే చెబుతూ ఉంటుంది. మహేష్ బాబు ఈమెకు ఇష్టమైన హీరో అయినప్పటికీ ‘సరిలేరు నీకెవ్వరు’ లో ఛాన్స్ వస్తే పాత్ర నచ్చలేదు అని ఈమె చేయలేదు.
ఇదిలా ఉంటే.. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ్’ లో ఈమె సీత పాత్ర పోషిస్తుంది. శ్రీరాముని పాత్రలో రణబీర్ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రావణాసురుడు పాత్రలో కేజిఎఫ్ హీరో యష్ నటిస్తున్నాడు. ఇప్పటికే సాయి పల్లవి లుక్స్ బయటకు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ లభించింది.
ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ.12 కోట్లు పారితోషికం తీసుకోబోతుందట. ‘రామాయణ్’ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. రెండిటికీ కలిపి సాయి పల్లవి అంత మొత్తం డిమాండ్ చేసిందట. వాస్తవానికి ఇది బాలీవుడ్ జనాలకి పెద్ద లెక్క కాదు. అక్కడి హీరోయిన్లు ఏకంగా రూ.20 కోట్లు, రూ.25 కోట్లు అంటూ డిమాండ్ చేస్తుంటారు.