ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టిన వైష్ణవ్ తేజ్ కు ఆ తర్వాత సినిమాలు భారీ షాకిచ్చాయి. కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు. మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినా ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమాలు ఫెయిలయ్యాయి. అయితే ఆదికేశవ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమా 2 గంటల 10 నిమిషాల నిడివితో ఈ సినిమా తెరకెక్కింది.
ఆదికేశవ మూవీకి రన్ టైన్ ప్లస్ కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో వరుస విజయాలు సాధిస్తున్న శ్రీలీల ఆదికేశవ సినిమాతో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. శ్రీలీల సక్సెస్ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా రిపీట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఆదికేశవ మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
వైష్ణవ్, శ్రీలీల జోడీ సూపర్ గా ఉందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. శ్రీలీలకు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఆదికేశవ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు యాక్షన్ సీన్లకు కూడా ప్రాధాన్యత ఉంది. వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా రిలీజ్ తర్వాతే కొత్త సినిమాలను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. ఆదికేశవ సినిమాపై మేకర్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఆదికేశవ (Aadikeshava) మూవీ ఇప్పటికే పలు రిలీజ్ డేట్లను మార్చుకోగా నవంబర్ 24వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. వైష్ణవ్ తేజ్ మార్కెట్ ను ఈ సినిమా రెట్టింపు చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వైష్ణవ్ తేజ్ ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే బాగుంటుందని మరికొందరు ఫీలవుతున్నారు. వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ 6 నుంచి 8 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని తెలుస్తోంది.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!