Vaishnav Tej: ‘రంగ రంగ వైభవంగా’ ఏమన్నా ఫీల్‌ ఇచ్చిందా?

టాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ను అభిమానించే కుర్ర హీరోలు చాలామందే ఉంటారు. అలాగే పవన్‌ను అనుకరించేవాళ్లూ ఉంటారు. ఎంత కాదని చెప్పినా, ఎంత వద్దనుకున్నా ఎక్కడో మూల పవన్‌ యాక్టింగ్‌, మేనరిజ్‌, యాటిట్యూడ్‌ రిఫరెన్స్‌లు కనిపిస్తుంటాయి. ఇదంతా బయటి హీరోల గురించి అయితే. అదే ఆ కుటుంబం నుండి వచ్చే హీరోలు అయితే ఆ రిఫరెన్స్‌లు ఇంకా ఎక్కువే కనిపిస్తాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ‘రంగ రంగ వైభవంగా’ టీజర్‌ వచ్చాక..

ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది సోషల్‌ మీడియాలో. దీనికి కారణం వైష్ణవ్‌ తేజ్‌ ఎక్స్‌ప్రెషన్స్. టీజర్‌ నిడివి తక్కువే అయినా.. సినిమా కంటెంట్‌ను, కాన్సెప్ట్‌ను బాగా అర్థమయ్యేలా కట్‌ చేశారు. హీరోయిన్‌ ఎలా అందంగా చూపించారో, వైష్ణవ్‌ తేజ్‌ ప్లస్‌ పాయింట్లను అంతగానే కవర్‌ చేశారు. ఈ క్రమంలో వైష్ణవ్‌ తేజ్‌ క్యూట్ యాటిట్యూడ్‌ కూడా టీజర్‌లో చూడొచ్చు. హీరోయిన్‌ను డోర్‌ కీ హోల్‌ నుండి చూడటం, ఆఖరున ఫైట్‌ సందర్భంగా చెమటను తుడుచుకోవడం,

నోట్లో నాలుకతో బుగ్గల్న కదపడం, చిన్నగా తలను షేక్‌ చేయడం ఇవన్నీ యంగ్‌ పవన్‌ కల్యాణ్‌ను గుర్తు చేస్తున్నాయి అని చెప్పొచ్చు. వైష్ణవ్‌ తేజ్‌లో కళ్లు పెద్ద ప్లస్‌ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి సినిమా ‘ఉప్పెన’ నుండి చాలామంది ఇదే మాట చెబుతున్నారు. రెండో సినిమా ‘కొండపొలం’లో కూడా అదే పని చేశారు. ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’లోనూ వైష్ణవ్‌ కళ్లకు క్లోజ్‌ షాట్స్‌ ఉన్నాయి. మామూలుగా అయితే హీరోయిన్లకు ఇలాంటి ఐస్‌ షాట్స్‌ ఉంటాయి. హీరోకు వేస్తున్నారు.

‘ఖుషి’ సినిమా టైమ్‌లో పవన్‌ కల్యాణ్‌ నుండి అలాంటి పోస్టర్లు చూశాం. ఇప్పుడు మళ్లీ వైష్ణవ్‌ తేజ్‌ దగ్గర అలాంటి ఫీల్‌ వస్తోంది. సాయిధరమ్‌ తేజ్‌ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇలానే మేనమామల రిఫరెన్స్‌లు ఉన్నాయి అని అన్నారు. అయితే ఎక్కువగా పెద్ద మేనమామ చిరంజీవి రిఫరెన్స్‌లే కనిపించాయి. ఇప్పుడు వైష్ణవ్‌లో చిన్న మామ పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు మేనమామల్ని పంచుకున్నట్లు ఉన్నారు 😆😆😆.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus