Vaishnav Tej, Akhil: మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌కి దారి ఇస్తున్న మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌!

Advertisement

అఖిల్‌ రీ రీ రీ ఎంట్రీకి సిద్ధం చేసుకున్న సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. చాలా రోజుల క్రితమే సిద్ధమైన ఈ సినిమాను విడుదల చేయడానికి పరిస్థితులు, ప్రకృతి సహకరించడం లేదు. అందుకే సినిమాను విడుదల చేద్దాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం వస్తోంది. దీంతో ఈసారి సినిమాను పక్కగా విడుదల చేసేద్దామని నిర్మాతలు భావిస్తున్నారట. అంతే కాదు దీని కోసం మెగా హీరో సైడ్‌ అవుతున్నారట. ఎవరా హీరో? ఏంటా కథ చూద్దాం!

అఖిల్‌, పూజా హెగ్డే జంటగా రూపొందిన సినిమా ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్‌ నిర్మాత. కరోనా తొలి వేవ్‌ సమయంలోనే సినిమా సిద్ధమైపోయింది. అయితే థియేటర్ల పరిస్థితి, కరోనా ఇంకా స్థిమితం కాకపోవడంతో రిలీజ్‌ ఆపారు. అయితే ఇప్పుడు అక్టోబరు 8 అంటూ కొత్త డేట్ చెప్పారు. నిజానికి ఆ డేట్‌ను ఇంకో సినిమా ఉండాలి. కానీ అఖిల్‌ కోసం ఆ సినిమా కాస్త పక్కనపెట్టారట.

మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ రెండో సినిమా ‘కొండపొలం’ అక్టోబరు 8న విడుదల చేస్తామని ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే ఇటీవల ప్రమోషన్స్‌ ఆపేశారు. ఏమైందా అని చూస్తే… అదే రోజు ‘… బ్యాచ్‌లర్‌’ వస్తుండటంతో… ఒకే రోజు రెండు సినిమాలు ఎందుకని క్రిష్‌ టీమ్‌ విడుదల వాయిదా వేసుకుందట. సోలో రిలీజ్‌ అయితే బెటర్‌ అని అనుకున్నారని టాక్‌. అయితే కారణం ఇదేనా అనేది ఇక్కడ డౌట్‌.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus