Vakeel Saab: నిర్మాత దిల్ రాజు అబద్ధం చెప్పారా..?

ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో వకీల్ సాబ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన సమయంలో రెండు వారాలకే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం 50 రోజుల తరువాత మాత్రమే వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుందని స్పష్టం చేశారు. అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ముందుగానే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ నెల 30వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుందని అమెజాన్ ప్రైమ్ అధికారక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటన వెలువడింది. కరోనా సెకండ్ వేవ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూతబడటంతో చిత్రబృందం ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. థియేటర్లలో హిట్టైన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్ ను విడుదల చేయగా ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

కరోనా విజృంభణ, ఇతర కారణాల వల్ల థియేటర్లలో సినిమా చూడలేని వాళ్లు వకీల్ సాబ్ డిజిటల్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సత్యదేవ్ అనే లాయర్ పాత్రలో నటించారు. శృతిహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్టైన పింక్ మూవీకి రీమేక్ గా వకీల్ సాబ్ తెరకెక్కగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. వకీల్ సాబ్ ముందుగానే ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో దిల్ రాజు 50 రోజుల తరువాత స్ట్రీమింగ్ అవుతుందని అబద్ధం చెప్పారని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus