Vakeel Saab: పవన్ కళ్యాణ్ మ్యానియా మామూలుగా లేదుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. 22 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాలని భావిస్తున్న దిల్ రాజు కల ఈ సినిమాతో తీరుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా వకీల్ సాబ్ రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సునీల్ నారంగ్ తో కలిసి కొండాపూర్ లో నిర్మించిన ఏఎంబీ మల్టీప్లెక్స్ లో వకీల్ సాబ్ సినిమా రేపు 27 షోలు ప్రదర్శించనున్నారని సమాచారం. మొత్తం 7 స్క్రీన్లు ఉండగా ఏడు స్క్రీన్స్ లో వకీల్ సాబ్ సినిమానే ప్రదర్శించనున్నారు. అయితే తొలిరోజు ప్రదర్శించనున్న 27 షోలకు సంబంధించిన టికెట్లు అన్నీ బుక్ అయ్యాయని సమాచారం. ఈ మల్టీప్లెక్స్ లో ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

మహేశ్ అడ్డాలో వకీల్ సాబ్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని ఇతర మల్టీప్లెక్స్ లలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం. వకీల్ సాబ్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా కలెక్షన్లపరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 84 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజవుతున్న వకీల్ సాబ్ ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నా పవన్ కళ్యాణ్ పై ఉన్న నమ్మకంతో ఈ సినిమాను థియేటర్లలో రేపు రిలీజ్ చేయడానికి బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus