ప్రస్తుతం కొన్ని థియేటర్లు అయితే తెరుచుకున్నాయి కానీ..వాటి వల్ల పెద్దగా ఉపయోగం అయితే లేదు. బహుశా కొత్త సినిమాలు ప్రదర్శించకపోవడం వల్లనే అనుకుంటాను..! నవంబర్ 8 నుండీ అన్ని థియేటర్లు ఓపెన్ అవుతాయి అని అంటున్నారు. అయితే జనాలు పూర్తిస్థాయిలో వస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ‘మరో 6నెలల వరకూ పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని’ నిర్మాత సురేష్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. జనాలను థియేటర్లకు రప్పించడం కోసం పెద్ద ప్లానింగే జరుగుతుంది.
2021 సంక్రాంతిని టార్గెట్ చేస్తూ… చాలా సినిమాలను విడుదల కాబోతున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటనలు వచ్చాయి. ‘క్రాక్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘రంగ్ దే’ వంటి క్రేజీ చిత్రాలను సంక్రాంతికే విడుదల చెయ్యబోతున్నట్టు దర్శకనిర్మాతలు స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో రెండు పెద్ద సినిమాలు కూడా చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అవి మరేవో కావు.. ఒకటి ‘కె.జి.ఎఫ్2’ మరొకటి ‘వకీల్ సాబ్’. నిజానికి ఇవే పెద్ద సినిమాలు అవుతాయి.
అయితే పవన్ క్రేజ్ ముందు యష్ నిలబడగలడా అన్నది పెద్ద ప్రశ్న. అసలే పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటప్పుడు ‘కె.జి.ఎఫ్2’ విడుదలైతే.. ఆ చిత్రానికి కొంచెం కష్టమనే చెప్పాలి. అందులోనూ ‘కె.జి.ఎఫ్2’ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా 30కోట్లకు కొనుగోలు చేశారు. 50శాతం సీటింగ్ తో థియేటర్లు రన్ అయితే.. అంత పెద్ద మొత్తం ‘కె.జి.ఎఫ్2’ కలెక్ట్ చేస్తుందా అనేది పెద్ద ప్రశ్న? చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో..!
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?