మెగా హీరోలకు కథలు రెడీ చేసిన వక్కంతం వంశీ.!

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ సినీ రంగంలో అనేక ఏళ్ళ అనుభవం ఉంది. రచయితకాకముందు హీరోగానూ నటించారు. నటుడిగా విజయం అందుకోక పెన్ పట్టుకున్నారు. రైటర్ గా మంచి హిట్స్ అందుకున్నారు. తొలిసారి మెగా ఫోన్ అందుకున్నారు. మెగా హీరో అల్లు అర్జున్ తో “నా పేరు సూర్య” చేశారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీష శ్రీధర్, బన్నీ వాసులు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే నెల 4 న థియేటర్లోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే వంశీ నెక్స్ట్ ప్రాజక్ట్ ఫిక్స్ అయిపోయినట్టు తెలిసింది. ఆ చిత్రంలో కూడా మెగా హీరోనే నటించనున్నట్లు సమాచారం.

తన వద్ద ఉన్న మూడు కథలను వక్కంతం మెగాహీరోలకు వినిపించారంట. కథలు నచ్చిన వారు ఏ కథను ముందు ఫైనల్ చేయాలో తెలియక ఆలోచనలో ఉన్నట్టు టాక్. ఈ మధ్య మెగా హీరోలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ కథ అయినా మెగా హీరోలు అందరూ వినాలని, ఆ కథ హీరోకి ఎవరు సూటవుతారో.. మనస్ఫూర్తిగా బయటికి చెప్పాలని.. తప్పుఒప్పులను బయటపెట్టాలని అనుకున్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ చెప్పిన కథ ఆ స్టేజ్ లోనే ఉందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. మెగా హీరోలందరూ కలిసి కథని, కథకి సూటయ్యే హీరో ని ఫిక్స్ చేస్తే.. అప్పుడు అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus