వాలెంటైన్స్‌ డే స్పెషల్‌: సినిమాల్లో బెస్ట్‌ లవ్‌ డైలాగ్స్‌ మీ కోసం..!

అబ్బాయి/ అమ్మాయిని మనసు గెలుచుకోవడం ఎంత కష్టమో, దాని కోసం ప్రేమను వ్యక్తం చేయడమూ అంతే కష్టం. మనసులోని భావాన్ని చెప్పడానికి ఆ సమయంలో మాటలు రావు. వచ్చినా అందంగా ఉంటాయని చెప్పలేం. దానికేముంది ఎలా చెప్పినా మనసులో ఇష్టముంటే ఓకే చేసేస్తారులే అనుకోవద్దు. ఎందుకంటే ప్రేమ ఎంత అందమైనదో, ఆ ప్రేమను కూడా అంతే అందంగా చెప్పాలి. అందుకే మన తెలుగు సినిమాల్లో రచయితలు చాలా అందమైన మాటలు రాసుకొచ్చారు ప్రేమ గురించి. అందులో కొన్ని మీకు పరిచయం చేస్తున్నాం.

* పది నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే.. ఇన్నాళ్లుగా మనసులో మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. (జాను)

* ప్రాణం అంటూ పోవాల్సి వస్తే అది నీతోనే. లేకపోతే నా ప్రేమకు అర్థమే లేదు (ఒక లైలా కోసం)

* ప్రేమ ఆరంభంలోనే అద్భుతంగా ఉందంటే.. ముగింపు ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాంటి సముద్రమంత ప్రేమను చూడాలంటే.. జీవితపు చివరి అంచుల్లోనే చూడగలవు. అలా చూడాలంటే ఒక్కమ్మాయినే ప్రేమించాలి (ఆరెంజ్‌)

* నీ కోసమే నా అన్వేషణ.. నీ కోసమే నా నిరీక్షణ. నిన్ను చూసే క్షణం కోసం.. కొన్ని వేలసార్లు మరణించైనా సరే.. ఒక్కసారి జన్మించడానికి సిద్ధంగా ఉన్నాను (ఆర్య)

* గులాబీ పువ్వును ఇష్టపడితే కోస్తాం.. ప్రేమిస్తే నీళ్లు పోస్తాం (కంచె)

* నువ్వు ఇచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే… లైఫ్‌ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది? (నిన్ను కోరి)

* ఈ ప్రపంచంలో నేను ప్రేమించినంతగా నిన్ను ఎవ్వరూ ప్రేమించలేరు. నువ్వు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. నన్ను మర్చిపోయినా.. ముసలిదానివైపోయినా.. చచ్చిపోయినా నీ మీద నా ప్రేమ చావదు (వాన)

* పెళ్లికి ముందులాగా.. పెళ్లి తర్వాత ప్రేమ కంటికి కనబడదు. అది ఒకరి మీద ఒకరికి ఉండే హక్కులోనే ఉంటుంది. ఒకరికోసం ఇంకొకరు తీసుకునే బాధ్యతలోనే ఉంటుంది (మజిలీ)

* కళ్లు కూడా మాట్లాడగలవని నాకు తెలియదు.. నీ కళ్లు నాతో మాట్లాడేదాకా! ప్రాణం లేకపోయినా బతకొచ్చని నాకు తెలియదు.. అది నువ్వు తీసుకెళ్లిపోయేదాకా! (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు)

* నా ప్రేమను చాపలా పరిస్తే ఈ భూమి సరిపోదు. గాలిలో నింపితే ఈ విశ్వం బద్దలవుతుంది. నీళ్లలో కలిపితే సముద్రాలు ఇంకిపోతాయి. శివుడు విషాన్ని దాచినట్టుగా దాయగలను (అందాల రాక్షసి)

* నేను పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే (ఓయ్‌)

* మనుషుల్ని సృష్టించిన ఆ దేవుడే ప్రేమను, మనసును సృష్టించాడు. మనిషి ప్రాణానికి పరిమితి పెట్టగలిగిన ఆ దేవుడు.. మనసుకు, ప్రేమకు ఎందుకు ఆ పరిమితులు పెట్టలేకపోయాడు (మనం)

* మనకు జ్వరమొచ్చినప్పుడు అమ్మ కావాలనిపిస్తుంది. భయమేసినప్పుడు నాన్న ఉంటే ధైర్యంగా ఉంటుంది. బాధలో ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్‌ ఉంటే బాగుంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు మన పక్కన ప్రేమించిన వాళ్లుంటే బాగుంటుంది (తీన్‌మార్‌)

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus