‘వాల్మీకి’ చిత్రం వల్ల కుల వివాదం?

  • July 2, 2019 / 03:10 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్. ఇక ప్రారంభంలోనే ‘వాల్మీకి’ టైటిల్ ను మార్చాలని వివాదాహాలు జరిగిన సంగతి తెలిసిందే. కింద మీదా పడి ఆ గొడవని సెటిల్ చేసుకుని షూటింగ్ మొదలుపెట్టారు. అయితే తాజా షెడ్యూల్ ను అనంతపూర్ లో ప్లాన్ చేసాడట దర్శకుడు హరీష్ శంకర్. అయితే బోయ కులస్థుడైన కొందరు వ్యక్తులు షూటింగ్ స్పాట్ వద్దకు వచ్చి చాలా గొడవ చేసారంట. దీంతో సిబ్బంది రంగంలోకి దిగి వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారట.

తమ కులానికి చెందిన వ్యక్తి పేరు సినిమాకి పెట్టడం పై వారు మండిపడుతూ.. ఇక్కడ షూటింగ్ జరగడానికి వీలు లేదంటూ వారు విరుచుకుపడ్డారట. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ వచ్చి.. ‘మా సినిమాలో ఎక్కడా వాల్మీకిని కించపరిచే విధంగా సీన్లు ఉండవంటూ’ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వారు వినకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసి టీంతో సహా హైదరాబాద్ కు తిరిగి వచ్చేసాడట. ఇప్పుడు ఆ షెడ్యూల్ ను చేవెల్ల పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడట హరీష్ శంకర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus