మళ్ళీ నాకు ఊపిరి పోసింది వారి మాటలే : వంశీ పైడిపల్లి

ఇటీవల మహేష్ తో తెరకెక్కించిన ‘మహర్షి’ చిత్రంతో హిట్టందుకున్నాడు వంశీ పైడిపల్లి. 2007లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన ‘మున్నా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన వంశీ పైడిపల్లి. మొదటి చిత్రంతోనే ప్రభాస్ లాంటి హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినప్పటికీ వంశీ కి అదృష్టం కలిసి రాలేదు. ‘మున్నా’ చిత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. అంతేకాదు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న దిల్ రాజు కి ప్లాప్ ఇచ్చిన చిత్రం ఇది. ఇక ఈ చిత్రం తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని తాజాగా వివరించాడు వంశీ పైడిపల్లి.

తాజాగా ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి వచ్చిన వంశీ పైడిపల్లి .. తన కెరియర్లోని ఒడిదుడుకులను గురించి ప్రస్తావించాడు. వంశీ మాట్లాడుతూ… “నా తొలి సినిమా ‘మున్నా’ పరాజయం పాలైన తరువాత నేను చాలా డీలాపడిపోయాను. నిరాశా నిస్పృహలతో చాలా రోజులు భారంగా గడిచాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ కాఫీ షాప్ లో చరణ్ తారసపడి ‘మున్నా’ విషయం ప్రస్తావిస్తూ ‘డైరెక్టర్ గా నువ్వు ఫెయిల్ కాలేదని’ చెప్పాడు. ఆ తరువాత ఎన్టీఆర్ – దిల్ రాజు కూడా అదే మాట అనడంతో నాలో ఉత్సాహానికి ఊపిరిపోసినట్టు అయ్యింది. అప్పుడు నేను మళ్ళీ ఒక కథ పై కూర్చుని కసరత్తుచేసి, దిల్ రాజు – ఎన్టీఆర్ లకు వినిపించాను. వాళ్లిద్దరికీ బాగా నచ్చేసిన ఆ కథే ‘బృందావనం’. ఈ చిత్రం తరువాత చరణ్ తో ‘ఎవడు’ చేశాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus