రాజమౌళి ప్రకటనతో బుక్కైన వంశీ పైడిపల్లి

మహర్షి సక్సెస్ కావడంతో మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లికి మరో సినిమా చేసే ఆఫర్ ఇచ్చాడు. మహర్షి సక్సెస్ ని మహేష్ ఆఫర్ ని ఎంజాయ్ చేస్తున్న వంశీకి మహేష్ తాజా నిర్ణయం షాక్ ఇచ్చింది. సరిలేరు నీకెవ్వరు మూవీ తరువాత మహేష్ వంశీతో మూవీ చేయాల్సి ఉండగా సడన్ గా చేయనని చెప్పి విరమించుకున్నారు. కారణంగా స్క్రిప్ట్ నచ్చక పోవడమే అని చెప్పారు. ఇక వంశీ స్క్రిప్ట్ కి ఆయన కొన్ని మార్పులు చేర్పులు చెప్పారని ఆ పనిలో వంశీ పైడిపల్లి తలమునకలై ఉన్నారని వార్తలు వచ్చాయి.

అదే సమయంలో గీత గోవిందం ఫేమ్ పరుశురాం తో ఆల్మోస్ట్ మహేష్ మూవీ ఒకే అయినట్లు తెలుస్తుంది. కాబట్టి మహేష్ నెక్స్ట్ మూవీ దాదాపు పరుశురాం దర్శకత్వంలో ఉంటుంది. ఐతే ఇటీవల రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ తర్వాత తన ప్రాజెక్ట్ మహేష్ తో అని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ 2021 చివర్లో లేదా 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. మరి ఈ గ్యాప్ లో మహేష్ ఒక్క సినిమా కంటే ఎక్కువ చేయలేడు.

పరుశురాంతో మూవీ అంటున్నారు కాబట్టి అది 2021లో విడుదల అవుతుంది. నెక్స్ట్ రాజమౌళి సినిమాలో జాయిన్ కావలసిన మహేష్ మరో సినిమాను ఒప్పుకొనే అవకాశం లేదు. కాబట్టి నిజంగా మహేష్ పై ఆశలతో స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నట్లైతే వంశీ పప్పులో కాలేసినట్టే. మహేష్ వంశీతో రాజమౌళి సినిమాకు ముందు సినిమా చేయని పక్షంలో వీరి ప్రాజెక్ట్ ఎప్పుడో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాజమౌళి ప్రకటన వంశీ పైడిపల్లి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.
Most Recommended Video


తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus