మహేష్ 25 వ సినిమా టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన డైరక్టర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా సమాజాన్ని మారుస్తూ.. ఎంటర్టైన్మెంట్ అందించడానికి కష్టపడుతున్నారు. మహేష్ అభిమానులు తలెత్తుకునేలా చేయడానికి కొరటాల శివ మంచి కథ, పక్కా స్క్రిప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత మహేష్ చేయనున్న 25 వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఆ చిత్ర డైరక్టర్ వంశీ పైడిపల్లి  న్యూయార్క్ లో లొకేషన్స్ సెలక్ట్ చేసి.. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తో కూర్చొని ట్యూన్స్ సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. అలా సినిమా పనులు మొదలవ్వగానే ఇలా రూమర్స్ మొదలయిపోయాయి.

అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి “కృష్ణా ముకుందా మురారి”, “హరే రామ హరే కృష్ణ” అనే రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇది వంశీ వరకు చేరింది. వెంటనే దీనిపై డైరక్టర్ స్పందించారు. ఈ టైటిల్స్ అనుకోవడం లేదని, ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదని తెలిపారు. ఫైనల్ కాగానే అధికారికంగా తామే ప్రకటిస్తామని చెప్పారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus