మూడు పెళ్లిళ్లు పెటాకులు.. మరోసారి ప్రేమ అంటున్న నటి!

సీనియర్ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనితా నటి కొన్ని సినిమాలు చేసింది. కానీ సక్సెస్ కాలేకపోయింది. అయితే మూడు పెళ్లిళ్లు చేసుకొని.. విడాకులు, విమర్శలతో సంచలన నటిగా ముద్ర వేసుకుంది. గతేడాది బిగ్ బాస్ సీజన్ లో కూడా పాల్గొంది. లాక్ డౌన్ లో ఈమె పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది. ఆ వివాహ జీవితం ఎక్కువ రోజులు సజావుగా సాగలేదు. పీటర్ పాల్ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే వనితా విజయ్ కుమార్ ని వివాహం చేసుకోవడంతో వివాదానికి దారి తీసింది.

ఆ తరువాత కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈమె తాను మరోసారి ప్రేమలో పడినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం హాట్ టాపిక్ గా మారింది. ‘మళ్లీ ప్రేమలో పడ్డాను.. ఇప్పుడు మీరు హ్యాపీయేనా?’ అంటూ పోస్ట్ పెట్టింది వనితా. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే వనితా నిజంగానే ప్రేమలో పడిందా..? లేక తనను విమర్శించే వాళ్లకు కౌంటర్ గా పోస్ట్ చేసిందా..? అనేది తెలియాల్సివుంది.

ఇరవై ఏళ్ల క్రితం నటుడు ఆకాష్ ని పెళ్లాడి ముగ్గురు పిల్లలు పుట్టిన తరువాత అతడికి విడాకులిచ్చింది. ఆ తరువాత 2007 లో ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని ఐదేళ్లు కాపురం చేసిన తరువాత అతడి నుండి విడిపోయింది. డాన్స్ మాస్టర్ రాబర్ట్ తో డేటింగ్ చేసి అతడికి బ్రేకప్ చెప్పింది. ఈ ఏడాది లాక్ డౌన్ లో పీటర్ ని పెళ్లాడి అందరికీ షాకిచ్చింది. కానీ ఈ వివాహ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడినట్లు వనిత చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus