నరేష్ – పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మళ్ళీ పెళ్లి’ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కాకూడదు అంటూ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమాలో ఆమె పాత్రను నరేష్ నెగిటివ్ గా చూపించినట్టు టీజర్, ట్రైలర్ వంటివి క్లారిటీ ఇచ్చాయి. నరేష్ – పవిత్ర కర్ణాటక వెళ్ళినప్పుడు ఓ హోటల్లో ఉండగా… అక్కడికి మీడియాని వెంటేసుకుని వచ్చి రమ్య రఘుపతి చేసిన రచ్చ అంతా చూశారు.
ఆ న్యూస్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పంచాయితీలు అందరికీ తెలిసినవే. అవన్నీ ‘మళ్ళీ పెళ్లి’ టీజర్, ట్రైలర్లో ఉన్నాయి. వీటిపై న్యూస్ ఛానల్స్ లో కూడా చర్చలు జరిగాయి. అలాగే ‘మళ్ళీ పెళ్లి’ ప్రెస్ మీట్లలో నరేష్ ను కూడా చాలా మంది రిపోర్టర్లు ఈ విషయమై ప్రశ్నలు వేయడం జరిగింది. ‘మళ్ళీ పెళ్లి’ లో రమ్య రఘుపతి పాత్రని పోషించింది వనిత విజయ్ కుమార్.
అయితే వనిత విజయ్ కుమార్ పోషించిన పాత్ర నిజ జీవితంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిదన్న విషయం ఆమెకు తెలీదట. తన పాత్ర ‘ఓ స్ట్రాంగ్ మహిళ లాంటి పాత్ర’ అన్నట్టు దర్శకుడు యం.యస్.రాజు చెప్పారట. కొన్నాళ్ల క్రితం ‘దేవి’ సినిమాకి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవంతో ‘మళ్ళీ పెళ్లి’ కి ఆమె ఓకే చెప్పేసినట్టు వనిత విజయ్ కుమార్ చెప్పింది. అలాగే తన వరకు ఆ పాత్రకు న్యాయం చేసానని కూడా ఈమె చెప్పుకుంటుంది.