సౌత్ సినిమాకు దొరికిన వైవిధ్యమైన నటి వరలక్ష్మి శరత్ కుమార్. కథానాయికగానే కెరీర్‌ను ప్రారంభించినా… క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయింది ఇప్పుడు. వరుస సినిమాలు అలాంటి పాత్రలతోనే చేస్తున్నా… ఏ రెండు సినిమాలూ ఒకేలా ఉండకుండా చూసుకుంటోంది. అంతలా సినిమాలు చేస్తోంది కదా భారీ ప్లాన్స్ ఏమైనా ముందుగానే పెట్టుకుని ఇప్పుడు సినిమాలు ఎంచుకుంటోంది ఏమో అనే డౌట్ రావొచ్చు. అదే మాట అడిగితే.. నాకు కెరీర్‌లో ప్లాన్స్ ఏమీ లేవు అంటోంది.
నేను ఒక సినిమా చేస్తున్నానంటే అందులో కొత్తదనం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నా అని చెప్పింది వరు శరత్ కుమార్. ‘క్రాక్’, ‘వీర సింహా రెడ్డి’, ‘కోట బొమ్మాళి పి.ఎస్’ అంటూ ఇటీవల వరుస విజయాలు అందుకున్న వరు… ఇప్పుడు ‘హను – మాన్’ చేసింది. ఇందులో పాత్రలో కాస్త యాక్షన్ టచ్ కూడా ఉంటుందని అని చెప్పింది.
కథలో ప్రాధాన్యం ఉందనేదే చూస్తాను అని చెప్పే వరు… అది హీరోయిన్ కాకపోయినా ఫర్వాలేదు అని అనుకోవడం వల్లే ఇంతమంచి సినిమాలు చేస్తున్నా అని చెప్పింది. భాష గురించి తానెప్పుడూ ఆలోచించలేదని, ఆసక్తికరమైన పాత్ర వస్తే ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా చేయడానికి సిద్ధమే అని చెప్పింది. బాలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నా.. పాత్ర నచ్చక ఆగిపోయాను అని చెప్పింది. ఇన్ని పరిశ్రమల్లో సినిమాలు చేస్తున్నారు కదా ప్లానింగ్ ఏంటి అంటే…
కెరీర్ విషయంలో ప్లానింగ్స్ వేసుకోవడం మానేశా అని చెప్పింది. తాను అనుకున్నట్టుగా ఏదీ జరగలేదని, అందుకే జీవితంలో ఏం జరగాలో అది జరిగిపోతోంది అనే ఆలోచనలో తాను ఉన్నానని తెలిపింది. మొన్న చిరంజీవి మిమ్మల్ని మెచ్చుకున్నారు కదా ఎలా అనిపించింది అని అడిగితే… చిరంజీవి మొన్న వేడుకలో అభినందించడం ఇన్నాళ్లూ పడిన శ్రమకి ప్రతిఫలంలా అనిపించింది అని ఆనందంగా చెప్పింది. ఆ కార్యక్రమం తర్వాత ఆయనకి థ్యాంక్స్ చెబుతూ మెసేజ్ చేశాను అని (Varalaxmi Sarathkumar) చెప్పింది వరు.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!