వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. వరలక్ష్మీ శరత్ కుమార్ కు కొన్నిరోజుల క్రితం నిశ్చితార్థం జరగగా ఈ ఏడాది చివర్లో ఆమె పెళ్లి వేడుక జరగనుంది. తెలుగులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఎక్కువగా నటిస్తున్న వరలక్ష్మి 2012 సంవత్సరంలో పోడాపోడీ అనే సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. పోడా పోడీ సినిమాకు విఘ్నేష్ శివన్ దర్శకుడు కాగా ఈ సినిమా కమర్షియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.
తెలుగు, కన్నడ భాషలపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన వరలక్ష్మి వచ్చిన ప్రతి ఆఫర్ ను అందిపుచ్చుకుంటూ నటిగా ప్రూవ్ చేసుకున్నారు. తారై తప్పట్టై సినిమా సక్సెస్ తో ఆమె కెరీర్ పరంగా వెనుదిరికి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం వరలక్ష్మి వయస్సు 38 సంవత్సరాలు. వరలక్ష్మి మాట్లాడుతూ పోడాపోడీ సినిమాలో యాక్ట్ చేసిన సమయంలో నా వయస్సు 22 అని 28 సంవత్సరాల లోపు స్టార్ స్టేటస్ అందుకోవాలని నేను భావించానని ఆమె చెప్పుకొచ్చారు.
32 సంవత్సరాల వయస్సులో పెళ్లి చేసుకొని 34 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నానని అయితే నా ప్లాన్ మాత్రం వర్కౌట్ కాలేదని ఆమె అభిప్రాయపడ్డారు. పోడాపోడీ మూవీ తర్వాత పర్సనల్ లైఫ్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టానని ఆమె కామెంట్లు చేశారు. నేను చేసిన పెద్ద తప్పు అదేనని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. అప్పుడే తాను సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టి ఉంటే ఎక్కువ సినిమాలు చేసేదానినని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చారు.
ఫెయిల్యూర్స్ నన్ను బలపరిచాయని వరలక్ష్మి పేర్కొన్నారు. వరలక్ష్మిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని భారీ హిట్లను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.