Varalaxmi Sarathkumar: వరలక్ష్మి రోల్ హైలైట్ గా బాలయ్య సినిమా!

  • December 20, 2022 / 05:12 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్ర పోషిస్తోంది. ఇదివరకు గోపీచంద్ డైరెక్ట్ చేసిన ‘క్రాక్’ సినిమాలో కూడా వరలక్ష్మి నటించింది. అందులో ఆమె పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఆమెని రిపీట్ చేస్తున్నారు గోపీచంద్ మలినేని. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో వరలక్ష్మి పాత్ర చాలా బలంగా రాసుకున్నారట. కథలో ఆమె పాత్రే కీలకమని తెలుస్తోంది.

వరలక్ష్మి పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుందట. ఆ ట్విస్ట్ వర్కవుట్ అయితేనే మిగతా కథలో ఎమోషన్ కి ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడని సమాచారం. వరలక్ష్మి ఇదివరకు చాలా పాత్రలు చేసింది. కానీ ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో ఉండే కీ ఎమోషన్ అంతా ఆ పాత్రలోనే ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది.

అలానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎపిసోడ్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఇక సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి టీజర్, సాంగ్స్ విడుదలయ్యాయి. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12 సంక్రాంతికి విడుదల కానుంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus